పోకిరీలపై ఫోకస్ పెట్టిన షీటీమ్..కంత్రీ వేషాలు వేస్తే కటకటాలు కన్ఫమ్..!

తెలంగాణా షీటీమ్ ఉమెన్ సేఫ్టీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనికోసం వినూత్న రీతిలో ఫొటోలు, మీమ్స్‌, షార్ట్‌ ఫిల్మ్‌ లు, సందేశాత్మక వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తోంది. సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు షీటీమ్స్‌ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనిట్లలో ఉన్న షీటీమ్స్‌ సిబ్బందికి దఫాలుగా పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.

New Update
పోకిరీలపై ఫోకస్ పెట్టిన షీటీమ్..కంత్రీ వేషాలు వేస్తే కటకటాలు కన్ఫమ్..!

తెలంగాణా షీటీమ్ ఉమెన్ సేఫ్టీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనికోసం పలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. మహిళా రక్షణకోసం వినూత్న రీతిలో ఫొటోలు, మీమ్స్‌, షార్ట్‌ ఫిల్మ్‌ లు, సందేశాత్మక వీడియోల ద్వారా సోషల్‌ మీడియానే ఉపయోగించుకుంటోంది.

publive-image

సోషల్‌ మీడియా వేదికగా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలపై ఆడపిల్లలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, తిట్టినా, వారి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసినా, సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్‌ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణిస్తోంది.

సదరు నేరాలకు పాల్పడిన వారికోసం ఎలాంటి శిక్షలు కాచుకుని కూర్చున్నాయో సవివరమైన పోస్టుల ద్వారా షీటీమ్స్‌ అవగాహన కల్పిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సందేశాత్మక వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్నది. వీటితో పాటుగా ఆయా కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

సోషల్‌ మీడియాలో మహిళలపై చోటుచేసుకుంటున్న వేధింపులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు షీటీమ్స్‌ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనిట్లలో ఉన్న షీటీమ్స్‌ సిబ్బందికి దఫాలుగా పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.

పోకిరీ చేష్టలను ఉపేక్షించకుండా తక్షణమే కేసులు నమోదు చేసి, తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి..అవసరమైతే కటకటాలకు సైతం పంపేలా ప్రణాళికలు సిద్ధంచేసింది.

వీటితోపాటు సైబర్‌ స్టాకింగ్‌, సైబర్‌ బుల్లింగ్‌, బ్లాక్‌మెయిలింగ్‌ వంటి తదితర అంశాలను సీరియస్‌గా తీసుకొని సోషల్‌ మీడియాలో పేట్రేగిపోతున్న పోకిరీల ఆటకట్టించేందుకు, అరెస్టు చేసేందుకు షీటీమ్స్‌ రంగం సిద్ధం చేసింది

Advertisment
Advertisment
తాజా కథనాలు