Shah Rukh Khan: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్‌ బాద్‌ షా!

బాలీవుడ్‌ బాద్‌ షా షారూక్‌ ఖాన్‌ (Sharuk Khan) ఆయన కుమార్తె సుహానా ఖాన్‌(Suhana Khan) , జవాన్‌ (Jawan)సినిమా హీరోయిన్‌ , లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayana Tara)ముగ్గురు కూడా తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు.

New Update
Shah Rukh Khan: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్‌ బాద్‌ షా!

Shah Rukh Khan Offers Prayers At Tirumala: బాలీవుడ్‌ బాద్‌ షా షారూక్‌ ఖాన్‌  ఆయన కుమార్తె సుహానా ఖాన్‌(Suhana Khan) , జవాన్‌ (Jawan)సినిమా హీరోయిన్‌ , లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayana Tara)ముగ్గురు కూడా తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు. జవాన్‌ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న సందర్భంలో చిత్ర యూనిట్‌ మొత్తం కలిపి ఆయన స్వామివారిని దర్శించకున్నారు.

షారూక్‌ ఖాన్‌ , నయనతార జంటగా నటించిన జవాన్‌ సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా వారు స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం చిత్ర బృందం సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

షారూక్‌ తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. దీంతో ఆయన దర్శనం అనంతరం ఆయన ధ్వజస్తంభానికి తల అన్చి మొక్కుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పఠాన్‌ సినిమాతో భారీ వసూళ్లను రాబట్టిన షారూక్‌..జవాన్‌ సినిమాతో కూడా భారీ వసూళ్లను రాబట్టాలని చిత్ర బృందం చూస్తుంది. ఇప్పటికే కేవలం జవాన్‌ అడ్వాన్స్‌ టికెట్ల బుకింగ్‌ మూడున్నర లక్షలకు పైగా అమ్ముడుపోయాయి. జవాన్‌ సినిమా విడుదల క్రమంలోనే షారూక్‌ గత వారం వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించారు.

Watch Jawan Official Trailer in Telugu:

జవాన్‌ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన రెండు రోజుల క్రితం అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ కు ఆయన ఓ ఘాటైన రిప్లై కూడా ఇచ్చారు. ఓ నెటిజన్‌ తనకు తన గర్ల్ ఫ్రెండ్‌ కు ఫ్రీగా టికెట్లు ఇవ్వమంటే..ప్రేమ ఫ్రీగా దొరుకుతుంది ఏమో కానీ..సినిమా టికెట్లు కాదు అంటూ సమాధానం ఇచ్చారు. డబ్బులు పెట్టి టికెట్లు కొని సినిమా చూసి ఎంజాయ్‌ చేయాలన్నారు. దీంతో నెటిజన్లు దటీజ్‌ షారూక్‌ అంటూ అన్నారు.

Also Read: ప్రేమ ఫ్రీగా దొరుకుతుందేమో.. సినిమా టికెట్లు కాదు బ్రదర్‌!: షారూక్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు