Y S Sharmila: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల ఫైర్! వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆఫీస్ లో స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే విధంగా లేకపోగా.. డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో బ్రిటీష్ వాళ్ళు అనుసరించిన విధంగా సాగుతోందని ఆమె విమర్శించారు.ఇక కేసీఆర్ 38 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి పరిపాలిస్తున్నారని.. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపితే దాన్ని పాలన అంటారా.. దిక్కుమాలిన పాలన అంటారని ఆమె విమర్శించారు.. By P. Sonika Chandra 15 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి Y s Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆఫీస్ లో స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే విధంగా లేకపోగా.. డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో బ్రిటీష్ వాళ్ళు అనుసరించిన విధంగా సాగుతోందని ఆమె విమర్శించారు. మణిపూర్ సంఘటనలు భరతమాతకే అవమానమన్నారు. పోలీసు స్టేషన్ల మీద దాడి చేసి 3 వేల ఆయుధాలను దోపిడీ చేసి 6 లక్షల రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్స్ దోపిడీ చేసి సామాన్య ప్రజల మధ్య బీభత్సాన్ని సృష్టించారని ఆమె ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా.. అని ఆమె నిలదీశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, 60 వేల మంది నిర్వాసితులయ్యారని, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారని ఇది భారత దేశం అవమానంతో తలదించుకునేది కాదా అన్నారు. కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు మానుకోవాలని, మతం పేరుతో చిచ్చు పెట్టడం.. ఆ మంటలోచలి కాచుకోవడం బీజేపీకి అలవాటే అని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఇక ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తీరు కూడా కేంద్రంలానే ఉందని ఆమె మండిపడ్డారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు, బార్లు, పబ్బులు, గుడులు, బడుల కంటే వైన్ షాపులు, బెల్ట్ షాపులే ఎక్కువగా ఉన్నాయని ఆమె ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణలో మహిళలకు భద్రత లేదని.. గౌరవం లేదన్నారు ఆమె. తెలంగాణలో అర్థరాత్రి కాదు.. పట్టపగలే ఆడపిల్లలు తిరిగే పరిస్థితి లేదన్నారు. ఆడపిల్లలు తల్లిదండ్రులేమో బిడ్డల్ని బయటకు పంపాలంటే భయపడుతున్నారని.. అదే మగ పిల్లలైతే మద్యానికి బానిసలవుతున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా షర్మిల ప్రశ్నించారు. మద్యం అమ్ముకొని కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని ఆమె విమర్శించారు. 38 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి పరిపాలిస్తున్నారని.. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపితే దాన్ని పాలన అంటారా.. దిక్కుమాలిన పాలన అంటారని ఆమె విమర్శించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి