Illegal Farmhouse Demolished: అక్రమార్కుల ఆస్తులపై బుల్డోజర్ అస్త్రం

కొంత కాలం క్రితం ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరేందర్‌ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాంహౌస్‌ లో బంధించి హింసించిన విషయం తెలిసిందే. ఆ ఫాంహౌస్‌కు అనుమతులు లేవని మునిసిపల్ సిబ్బంది గుర్తించారు.ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడంతో అధికారులు దానిని కూల్చి వేశారు.

New Update
Illegal Farmhouse Demolished: అక్రమార్కుల ఆస్తులపై బుల్డోజర్ అస్త్రం

Illegal Farmhouse Demolished: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్ పరిధిలో కొంత కాలం క్రితం ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరేందర్‌ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాంహౌస్‌ లో బంధించి హింసించిన విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ధర్మగిరిగుట్ట ఆలయానికి సమీపంలో ఆ ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్‌కు అనుమతులు లేవని మునిసిపల్ సిబ్బంది గుర్తించారు.

ఫాంహౌస్ యాజమానికి నోటీసు జారీ చేశారు. ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మునిసిపల్ అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేయడంతో దానిపై చర్యలు తీసుకుంటమన్నారు. జేసీబీలతో ఫాంహౌస్‌ను కూల్చివేశారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిగాయి. భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రౌడీలు ఎవరినైనా ఇబ్బంది పెట్టిన, భయపెట్టిన నేరుగా పోలీసులను సంప్రదించాలని అన్నారు.

Also read: మదనపల్లె సబ్‌ కలెక్టరేట్ ను పరిశీలించిన డీజీపీ.. అగ్ని ప్రమాదంపై కీలక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు