Seethakka vs. Bade Nagajyoti: సీతక్క వర్సెస్ బడే నాగజ్యోతి.. ఈ బిగ్ ఫైట్ లో ఎవరిది పైచెయ్యి!! ఒకరేమో మాజీ నక్సలైట్.. వరుసగా ఆ నియోజక వర్గంలో విజయాన్ని అందుకుంటున్న నేత. మరొకరేమో మాజీ నక్సలైట్ కూతురు..అధికార పార్టీ జడ్పీ ఛైర్ పర్సన్. మరి వీరిద్దరు ఓకే నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తలపడితే.. అది టఫ్ ఫైటే అవుతుంది. రసవత్తర పోరుకు కేరాఫ్ అడ్రస్ అవుతుంది. ఆ రణరంగమే ములుగు నియోజకవర్గం... By P. Sonika Chandra 23 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి Seethakka vs. Bade Nagajyoti: ఒకరేమో మాజీ నక్సలైట్.. వరుసగా ఆ నియోజక వర్గంలో విజయాన్ని అందుకుంటున్న నేత. మరొకరేమో మాజీ నక్సలైట్ కూతురు..అధికార పార్టీ జడ్పీ ఛైర్ పర్సన్. మరి వీరిద్దరు ఓకే నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తలపడితే.. అది టఫ్ ఫైటే అవుతుంది. రసవత్తర పోరుకు కేరాఫ్ అడ్రస్ అవుతుంది. ఆ రణరంగమే ములుగు నియోజకవర్గం. ఈసారి ఈ నియోజకవర్గం నుంచి సేమ్ నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఇద్దరు మహిళా నేతలు బరిలోకి దిగుతుండడంతో.. ఆ గిరిజన బిడ్డలు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠగా మారింది. ఇక గులాబీ బాస్.. వరుసగా ములుగు నియోజకవర్గంలో సాటిలేని నేతగా దూసుకెళుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్కకు చెక్ పెట్టడానికి అనూహ్యంగా బడే నాగజ్యోతిని రంగంలోకి దింపారు. దీంతో సీతక్క వర్సెస్ బడే నాగజ్యోతిగా సీన్ మారింది. మరి ఈ వార్ లో ఎవరి బలాబలాలు ఏంటీ..ఇద్దరిది నక్సలిజం బ్యాక్ గ్రౌండే అయిన నేపథ్యంలో..ఫైట్ ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవాలనుకుంటే రీడ్ దిస్ స్టోరీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే,మాజీ నక్సలైట్ సీతక్క..! టీ కాంగ్రెస్ లో సీతక్క అంటే ఓ ఫైర్ బ్రాండ్. ఎలా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. సీతక్కే సీఎం అనేంతగా. ఇక పూలన్ దేవి రచనలతో ప్రేరణ పొందిన సీతక్క పదో తరగతి చదువుతున్నప్పుడే నక్సలిజం వైపు ఆమె అడుగులు పడ్డాయి. ఆర్థిక దోపిడీ, కుల వివక్ష,గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులు చేస్తున్న దమన కాండకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగింది. ఈ క్రమంలోనే ఆమె ఆ ప్రాంతంలోని గిరిజనులకు అక్కగా మారింది. అయితే ఎన్టీఆర్ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చినప్పుడు ఆమె తిరిగి జనం మధ్యలోకి వచ్చింది. న్యాయవాది విద్యను అభ్యసించింది. అయితే ఆమె అడవులను వదిలినా.. సామాజిక సేవలోనే ఉండేది. దీంతో టీడీపీ 2004 లో టికెట్ ఇచ్చి ములుగు నుంచి ఆమెను బరిలోకి దింపింది. అయితే మొదటి సారి ఆమెకు ఓటమి తప్పలేదు. ఇక 2009 కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యను ఓడించి ఆమె మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టింది. కాగా, 2014 లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయింది. అప్పుడు సైకిల్ దిగి కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అయ్యారు. ఇక 2018 ఎన్నికల్లో ఆమె తిరిగి ములుగులో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి విజయాన్ని సొంతం చేసుకుంది. మరో వైపు పార్టీలో కూడా అంచలెంచులుగా ఎదుగుతోంది సీతక్క. తాను ఎమ్మెల్యేగా ఉన్నా.. ఓ సాధారణ మహిళలా..గిరిజనలకు సేవలందిస్తూ.. ములుగు నియోజక వర్గంలో ఓ తిరుగులేని మహిళా నాయకురాలిగా ఆమె ఎదిగింది. దీంతో వరుసగా ములుగు ప్రజలు ఆమెకు పట్టం కడుతున్నారు. మాజీ నక్సలైట్ కూతురు బడే నాగజ్యోతి రాజకీయ ప్రస్తానం..! ములుగు జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండలం కలవపల్లి గ్రామం బడే నాగజ్యోతి స్వస్థలం. ఆమె తండ్రి బడే నాగేశ్వర రావు గతంలో నక్సలైట్ గా పనిచేశారు. ములుగులో గిరిజనుల మద్దతు బాగా ఉన్న ఆయన 2018 లో పోలీసుల ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆమె మామ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రస్తుతం నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి యాక్షన్ టీమ్ కమాండర్ గా ఉన్నారు. దీంతో ఆమె కుటుంబానికి మావోయిస్ట్ నేపథ్యం బలంగా ఉంది. ఇక ఆమె కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ సి, బీఈడీ చేసింది. 2019 లో ఆమె సర్పంచ్ గా పోటీ చేసి గెలిచింది. తరవాత టీఆర్ఎస్ లో చేరి తాడ్వాయి మండలం నుంచి జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. దీంతో ప్రస్తుతం ఆమె జడ్పీ ఛైర్ పర్సన్ గా కొనసాగుతోంది. అయితే సోమవారం రోజున సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో ఆమె పేరు ఉండడం టీవీలో చూసి ఆమె ఆశ్చర్యానికి గురైంది. సీతక్క వర్సెస్ నాగజ్యోతి.. బిగ్ ఫైటే..! ఇలా ఇద్దరి నేపథ్యం నక్సలిజమే ఉండడం.. ఒకరు కాంగ్రెస్ నుంచి మరొకరు అధికార పక్షం బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతుండడంతో ములుగు ఎలక్షన్ ఫైట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారింది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ మొత్తం నలభ్భైఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్కకు చెందిన లంబాడా సంఘంలోనే దాదాపుగా 18 వేల మంది ఓటర్లున్నారు. కాగా, ములుగు నియోజకవర్గంలో ప్రధాన ఓటర్లుగా ఉన్న కోయ సామాజిక వర్గం ఓట్లను కారు ఖాతాలోకి వేయాలనే టార్గెట్ తో నే గులాబీ బాస్ బరిలోకి బడే నాగజ్యోతిని దింపినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా రసవత్తరంగా మారిన ఈ ఫైట్ లో ఎవరిది పై చెయ్యి అవుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి