బిగ్ బుల్ గా మారిన సంజయ్ దత్

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్‌’. ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌ భారీ హిట్ అయింది. ఇప్పడు దానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్‌’రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తాజాగా ముంబయిలో స్టార్ట్ అయింది.

author-image
By G Ramu
New Update
బిగ్ బుల్ గా మారిన సంజయ్ దత్

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్‌’. ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌ భారీ హిట్ అయింది. ఇప్పడు దానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్‌’రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తాజాగా ముంబయిలో స్టార్ట్ అయింది.

యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఓవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు సినిమా నుంచి ఇంకో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రామ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇప్పుడు సంజయ్ దత్ లుక్ ను విడుదల చేశారు.

‘డబుల్ ఇస్మార్ట్‌’ లో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో సంజయ్ దత్ పేరు బిగ్ బుల్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ గా మేకోవర్‌ అయ్యాడు.

అటు బిగ్ బుల్ లుక్ కూడా మంచి స్టయిలిష్ గా ఉంది. వీళ్లిద్దర్నీ సిల్వర్ స్క్రీన్ పై చూసేందకు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఆమె పేరును కూడా వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 8న 'డబుల్ ఇస్మార్ట్‌' థియేటర్లలోకి రాబోతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు