Sam Pitroda: ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు జైరాం రమేష్ తెలిపారు. By V.J Reddy 08 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sam Pitroda: కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు జైరాం రమేష్ తెలిపారు. "Mr. Sam Pitroda has decided to step down as Chairman of the Indian Overseas Congress of his own accord. The Congress President has accepted his decision," says Congress leader Jairam Ramesh. pic.twitter.com/XgAxe2dCQC — ANI (@ANI) May 8, 2024 కొంప ముంచిన నోటి దూల.. భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ మాజీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా (Sam Pitroda) కొత్త వివాదానికి తెరలేపారు. అమెరికాలో తాను రేకెత్తించిన వారసత్వ పన్ను వ్యాఖ్యల మంటలను ఆర్పే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు “దక్షిణాదిలో ఆఫ్రికన్‌ల వలె కనిపిస్తారు – పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు – తూర్పున ఉన్నవారు చైనీస్‌లా కనిపిస్తారు.” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మండిపడ్డ మోదీ.. దీని మీద ప్రధాని మోదీ సైతం స్పందించారు. దేశాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ అనుకుంటోంది అని మండిపడ్డారు ప్రధాని మదీ. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తాము సంచమని ఆయన హెచ్చరించారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువైపు తీసుకెళ్ళాలని చూస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా మంది ప్రజలు నల్లగా ఉంటారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలని మోదీ అన్నారు. వరంగల్ మామునూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భాగంగా మోదీ శ్యామ్ పిట్రోడా కలర్ వ్యాఖ్యలపై స్పందించారు. #sam-pitroda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి