చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారు... సజ్జల ఫైర్! ఏపీని అభివృద్ధి పేరుతో చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సీఎం జగన్ హయాంలో 4 లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామని తెలిపారు. By V.J Reddy 08 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP Politics: వైసీపి తరపున మళ్ళీ ప్రతి గడపకూ వెళ్తామని వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు వివరిస్తామని అన్నారు. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా ఒకటికి మించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమం ద్వారా అభివృద్ధి, సంక్షేమమే అభివృద్ధి అని జగన్(CM Jagan) నిరూపించారని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమం ఆగలేదని.. ప్రజలకు అండగా నిలవటంలో సీఎం జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. జీఎస్డీపి చంద్రబాబు(Chandra Babu) హయాంలో 22వ ప్లేసులో ఉండేదని.. జగన్ వచ్చాక మొదటి స్థానానికి వచ్చిందని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు 34 వేలు ఇస్తే.. జగన్ వచ్చాక 4 లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. Also Read: విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు! లక్షా 30 వేలు సచివాలయాల్లో, 50 వేలకుపైగా మెడికల్ డిపార్ట్మెంట్‌లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని.. దేశంలో మిగతా పార్టీలకంటే ప్రజల ముంగిటకు వెళ్లగలిగే ధైర్యం వైసీపికి ఉందని అన్నారు. ఏపీకి జగనే ఎందుకు కావాలంటే..? అనే కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. జగన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డంగించేలా టీడీపీ(TDP) చేస్తున్న కుట్రలను ఎండగడతామని హెచ్చరించారు. Also Read: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం! చంద్రబాబు అభివృద్ధి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు సజ్జల. జన్మభూమి కమిటీల దోపిడీ చేసినందునే జనం వారిని ఇంటికి పంపారని.. కానీ జగన్ చేసిన అభివృద్ధి కళ్ల ఎదుటే కనపడుతోందని అన్నారు. 2014లో 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.. మరి అధికారంలోకి వచ్చాక ఇచ్చారా? అని ప్రజలను అడుగుతామని అన్నారు. చంద్రబాబు హామీలకు నేనే పూచీ అని అప్పట్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చెప్పారు.. మరి ఎందుకు ప్రశ్నించలేదో అడుగుతామని తెలిపారు. తాము అధికారంలోకి రాలేమని చంద్రబాబుకు తెలిసే తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. #ap-politics #sajjala-comments-on-chandrababu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి