BRS MLC Kavitha : తీహార్‌ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్‌!

మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో అరెస్ట్‌ అయ్యి తీహార్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు భేటీ అయ్యారు.జైలులో కవితకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

New Update
BRS MLC Kavitha : తీహార్‌ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్‌!

Tihar Jail : మద్యం కుంభకోణం (Liquor Scam) ఆరోపణల కేసులో అరెస్ట్‌ అయ్యి తీహార్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తో మాజీ మంత్రులు భేటీ అయ్యారు. తీహార్ జైలుకు వెళ్లి ఆమె పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం తీహార్ జైలుకు వెళ్లిన సబిత ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) లు కవితతో కాసేపు సమావేశమయ్యారు. కవితతో మాజీ మంత్రులిద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు.

జైలులో కవితకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీన కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం కవిత ప్రయత్నిస్తున్నారు.

Also read: నీట్ పేప‌ర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు