RTV ఎక్స్‌క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..! కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో 15 రోజులుగా దెయ్యం మిస్టరీ వీడటం లేదు. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఆర్టీవీ బృందం పర్యటించింది. నిర్మానుషంగా ఉన్న వీధులలో కుక్కల అరుపులు తప్ప ఎవరూ కనిపించని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 13 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో 15 రోజులుగా దెయ్యం మిస్టరీ వీడటం లేదు. క్షుద్ర పూజలు, దెయ్యం వదంతులపై.. నిజాలు నిగ్గు తేల్చేందుకు RTV సాహసం చేసింది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కాండ్రకోట గ్రామంలో ఆర్టీవీ బృందం పర్యటించింది. నిర్మానుషంగా ఉన్న వీధులలో కుక్కల అరుపులు తప్ప ఎవరు కనిపించని పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా చీకటపడితే చాలు భయంతో వణికిపోతూ ఇళ్లలోనే పరిమితమవుతున్నారు గ్రామస్తులు. మరి కొన్ని ప్రాంతాలలో కర్రలు పట్టుకుని అగంతకుడు కోసం గుంపులు గుంపులుగా కాపలా ఉంటున్నారు యువకులు. Also Read: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు మృతి..! కాండ్రకోట గ్రామంలో ఎక్కడైతే అగంతకుడు ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఆర్టీవీ ప్రతినిధి. గత నెల 29వ తేదీన అదే ప్రాంతంలో ముగ్గు వేసి, పసుపు కుంకుమ నిమ్మకాయలు ఎండుమిర్చితో క్షుద్ర పూజలతో మొదలైన దెయ్యం భయ్యం..మూడవ తేదీన మేకను బలి తీసుకుని తినివేసిన కళేబరంతో జనం మరింత ఆందోళన చెందుతున్నారు. గత శుక్రవారం అమావాస్య నాడు గ్రామానికి పట్టిన దుష్టశక్తిని వదిలించేందుకు మహా యాగం తలపెట్టారు గ్రామస్తులు. స్థానిక నూకాలమ్మ తల్లి గుడి వద్ద గ్రామ పెద్దలు కాలభైరవ సహిత అష్టదిగ్బంధ మహా చండీయాగాన్ని నిర్వహించారు. Also Read: మాజీ మంత్రే భువనేశ్వరిని టికెట్ అడుక్కునే పరిస్థితి.. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటే ఇదే: కేశినేని అదే రోజు స్థానిక ఎస్సీ కాలనీలో ఓ యువతి ఇంటివద్ద అగంతకుడు అలజడి సృష్టించినట్లు తెలుస్తోంది. రకరకాల అరుపులు, వింత ఆకారంతో చెట్లపై నుండి నడుచుకుంటూ పారిపోవటం గ్రామస్తులు చూశామని అంటున్నారు. ఆ రోజు నుంచి కొందరు ఇళ్ళు వదిలి వెళ్ళిపోయారని స్థానికులు వాపోతున్నారు. మరుసటి రోజే కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో మరో క్షుద్రపూజలు అలజడి రేపాయి. ఆటో డ్రైవర్ కి కనిపించిన వింత ఆకారం.. అదే ప్రాంతంలో ముగ్గు, బొమ్మ, కుంకుమతో పూజ చేశారని తెలిపాడు. దీంతో కాండ్రకోట గ్రామాన్ని విడిచి వేరొక ప్రాంతానికి దెయ్యం పోయిందని మరో ప్రచారం జరుగుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికి భయం వీడనట్లు తెలుస్తోంది. కాగా, వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. #kakinada-district #black-magic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి