నా గెలుపు 87పల్లెల ఆత్మగౌరవం.. ఆర్టీవీతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఎక్స్‎క్లూజివ్ ఇంటర్వ్యూ

నిస్వార్థ రాజకీయాల కోసమే తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి. ఆర్మూరు నియోజకవర్గంలో దుర్మార్గంగా వ్యవహరించిన అధికారపార్టీ అభ్యర్థిని గద్దె దించడం సంతోషాన్నిచ్చిందన్నారు. అక్కడ బీఆర్ఎస్ ఓటమితో 87గ్రామాల ప్రజలకు విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు.

New Update
నా గెలుపు 87పల్లెల ఆత్మగౌరవం.. ఆర్టీవీతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఎక్స్‎క్లూజివ్ ఇంటర్వ్యూ

Paidy Rakesh Reddy: నిస్వార్థ రాజకీయాల కోసమే తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి. ఆర్మూరు నియోజకవర్గంలో దుర్మార్గంగా వ్యవహరించిన అధికారపార్టీ అభ్యర్థిని గద్దె దించడం సంతోషాన్నిచ్చిందన్నారు. అక్కడ బీఆర్ఎస్ ఓటమితో 87గ్రామాల ప్రజలకు విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. ఎర్రచందనం వ్యాపారంలో అనుభవం రీత్యా ఆయన పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం దృష్టిపెడితే యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉందన్నారు. తాను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, ఎప్పటికీ బీజేపీతోనే ఉంటానని స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి: iphone Offers: మళ్లీ మళ్లీ రాని ఆఫర్.. సగం ధరకే ఈ ఐఫోన్!

ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. రూ. 500 జీతం కోసం ఎదురుచూపులు చూసిన ఆయన ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. కింది స్థాయి నుంచి వచ్చి వ్యాపార రంగంలో వెనుదిరిగి చూడకుండా.. అక్కడి నుంచి క్రమంగా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు పైడి రాకేశ్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఆర్మూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎర్రచందనం వ్యాపారం నుంచి రాజకీయ రంగం వరకూ ఆయన ప్రయాణం ఆసక్తికరం. ఆయన వ్యాపార, రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన ఇంటర్వ్యూ ‘అన్ సెన్సార్డ్ విత్ రాకేశ్ రెడ్డి’ని కింది లింక్ లో చూడొచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు