ఆర్టీసీ కార్పొరేషన్ అలాగే..ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి..క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ సర్కార్!! ఆర్టీసీ బిల్లు రగడ పై కేసీఆర్ సర్కార్ గవర్నర్ కోరిన వివరణను రాతపూర్వకంగా క్లుప్తంగా పంపింది. అయితే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ.. ఆర్టీసీ కార్పొరేషన్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది సర్కార్. ఇక గైడ్ లైన్స్ ప్రకారమే కార్మిక చట్టాలు వర్తింపచేస్తామని.. జీతభత్యాల విషయంలో అన్నీ నిబంధనలు ఫాలో అవుతామని బదులిచ్చింది. మరి ఇప్పుడైనా.. గవర్నర్ సంతృప్తి చెంది..టీఎస్ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..!! By P. Sonika Chandra 05 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి ఆర్టీసీ బిల్లు రగడ పై కేసీఆర్ సర్కార్ గవర్నర్ కోరిన వివరణను రాతపూర్వకంగా క్లుప్తంగా పంపింది. అయితే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ.. ఆర్టీసీ కార్పొరేషన్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది సర్కార్. కాగా, గవర్నర్ ఈ బిల్లుకు సంబంధించిన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన వివరణలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఐదు విషయాలపై గవర్నర్ సందేహాలు వ్యక్తం చేశారు. వాటి పై వివరణ ఇవ్వాలని రాజ్ భవన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేఖ రాసింది. అయితే దీనికి సమాధానం ఇస్తూ.. ప్రభుత్వం ఆ సందేహాలను క్లియర్ చేసింది. ఆర్టీసీ కార్మికులు మాత్రమే ప్రభుత్వంలోకి వస్తారని.. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తామని సంస్థ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతుందని తెలిపింది. ఇక గైడ్ లైన్స్ ప్రకారమే కార్మిక చట్టాలు వర్తింపచేస్తామని.. జీతభత్యాల విషయంలో అన్నీ నిబంధనలు ఫాలో అవుతామని కేసీఆర్ సర్కార్ గవర్నర్ కు బదులిచ్చింది. ప్రత్యేక ప్రణాళిక ద్వారా కండక్టర్ ఇంకా కంట్రోలర్లకు న్యాయం చేస్తామని తెలిపింది. కేంద్రం వాటా ఇంకా గ్రాంట్లు, రుణాల విషయంలో నియమ నిబంధనలన్నీ తప్పకుండా ప్రభుత్వం ఫాలో అవుతుందని గవర్నర్ కు వివరణ ఇచ్చింది. షెడ్యూల్ 9 ప్రకారం రూల్స్ మాటేంటన్న గవర్నర్ ప్రశ్నకు.. ఏపీ తరహాలోనే విలీనం అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కాగా, గవర్నర్ ఈ కింది 5 అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. 1.1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సహాయం గురించి ఎలాంటి వివరణ లేదు. 2.రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడం పై సమగ్ర డీటైల్స్ బిల్లులో లేవు. 3.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి ప్రయోజనాలు ఎలా కాపాడుతారు.. 4.ఆర్టీసీ కార్మికుల భద్రత పై క్లారిటీ లేదు. 5.వారి భవిష్యత్ ప్రయోజనాలపై మరింత స్పష్టత కావాలన్నారు. మరి ఇప్పుడైనా.. గవర్నర్ సంతృప్తి చెంది..టీఎస్ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో.. లేదో అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి