ఒకే రోజులో కమలా హ్యరిస్ కు విరాళంగా వచ్చి చేరిన రూ.677 కోట్లు!

డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యరిస్ కు మద్దతు పెరుగుతోంది. ఆమె ప్రచారానికి ఒక్కరోజులోనే రూ.677 కోట్ల విరాళం అందింది. పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా త్వరలో ఆమెను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరు భావిస్తున్నారు.

New Update
ఒకే రోజులో కమలా హ్యరిస్ కు విరాళంగా వచ్చి చేరిన రూ.677 కోట్లు!

నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత జో బైడెన్ ఉన్నారు.నవంబర్ లో జరిగే ఎన్నికలకు ట్రంప్ పై మళ్లీ పోటీ చేయాలని ఆయన భావించారు.అందుకోసం ప్రచారం కూడా చేశారు. కొన్ని లైవ్ డిబేట్లలో ట్రంప్ తో మాట్లాడేందుకు బైడెన్ చాలా తడబడ్డారు. అదేవిధంగా, విలేకరుల సమావేశంలో, బైడెన్ పొరపాటుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పుతిన్ అని , అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హ్యారిస్ ను ట్రంప్ అని పేర్కొన్నాడు.

ఈ సంఘటనలు డెమోక్రాట్లలో అసంతృప్తిని కలిగించాయి. మాజీ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా జో బిడెన్ పదవి నుండి వైదొలగాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన అనారోగ్య, వ్యక్తి గత కారణాల వల్ల అధ్యక్ష పదవి నుంచి  తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా బైడెన్ తన మద్దతును తెలిపారు.

అయితే ఇప్పటి వరకు డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించలేదు. కమలా హారిస్‌కు పార్టీ మెజారిటీ మద్దతు ఉన్నందున అధ్యక్ష పదవిని దాదాపు ఖాయం చేసుకుంది. దీంతో ఆమె ప్రచారానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గత 24 గంటల్లోనే ఆమెకు 81 మిలియన్ డాలర్లు (రూ. 677 కోట్లు) విరాళాలు అందినట్లు సమాచారం. దీంతో కమలా హ్యారిస్ కు అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే పనులు జోరుగా సాగుతున్నాయి. గతంలో 'బైడెన్ హ్యారిస్ ప్రచారంగా పిలిచేవారు. ఇప్పుడు ఆ పేరు కాస్త 'హ్యారిస్ బార్ ప్రెసిడెంట్'గా మార్చి పిలుస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు