మీ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీకి సిద్దమా? మంత్రి రోజా సవాల్..!

చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనేశ్వరి చెప్పినట్లు నిజం గెలవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. నాడు రెండెకరాల భూమి.. రెండు సెంట్ల ఇల్లు మాత్రమే కలిగిన ఉన్న చంద్రబాబుకు.. నేడు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆస్తులపై సీబీఐ విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు మంత్రి రోజా.

New Update
Minister Roja: జగన్ మళ్లీ సీఎం అవుతారు.. మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

Roja Fires on Bhuvaneswari:  స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికిపోవడంతో టిడిపి నేతలు విన్యాసాలు చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు నీ బ్రతికుండగానే వర్ల రామయ్య, మాజీ మంత్రి అమర్నాథ్ లు చంపేసినట్టు మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు దోచుకున్నందుకే జైల్ లో ఉన్నాడని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని మంత్రి వ్యాఖ్యనించారు.

భువనేశ్వరీ చెప్పినట్లు నిజం గెలవాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి రోజా అన్నారు. మిగతా స్కాం లలో లోకేష్, భువనశ్వరి చేసిన దోపిడీని కూడా కోర్టులు గమనించి జైల్లో శాశ్వతంగా పెట్టాలని అన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనేశ్వరి చెప్పినట్లు నిజం గెలవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. నాడు రెండెకరాల భూమి.. రెండు సెంట్ల ఇల్లు మాత్రమే కలిగిన ఉన్న చంద్రబాబుకు.. నేడు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆస్తులపై సీబీఐ విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు మంత్రి రోజా.

Also Read: బెదిరింపులకు భయపడేదే లేదు.. సీఐడీకి నారా భువనేశ్వరి సవాల్..

ఈ నేపధ్యంలోనే భువనశ్వరి తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ” సీఐడీకి సవాల్ విసురుతున్నా.. మాపై ఎలాంటి విచారణనైనా చేసుకోండి. చంద్రబాబు పడిన కష్టాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు కోసం మహిళలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. అరెస్టులు చేస్తున్నా మహిళలు భయపడడం లేదు. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వం ఎంక్వయిరీ వేయడం విడ్డూరంగా ఉంది. పనికిమాలిన ఎంక్వయిరీలు ఎందుకు? పిచ్చిపిచ్చి ఆలోచనలు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ప్రభుత్వంలో ఏమాత్రం లేదు. జీవితంలో సమస్యలు మామూలే. త్వరలో మా కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.” అని విశ్వాసం వ్యక్తం చేశారు భువనేశ్వరి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

పాడెపై శవం ముందు కొందరు డ్యాన్సులు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ ఆడ, మగ అంతా కలిసి శవం ముందు డీజే పాటలకు డ్యాన్సులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

New Update
video viral.

video viral

సాధారంగా ఎవరైనా చనిపోతే బోరున ఏడుస్తారు. తమతో కలిసి జీవించే ఒక వ్యక్తి ఇకపై ఉండడని తెలిసి ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతారు. బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతారు. ఇంటి నుంచి స్మశానవాటికకు తీసుకెళ్లేంతవరకు ఏడ్చుకుంటూనే పాడెతో వెళ్తారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

శవం ముందు పెళ్లి డ్యాన్స్

కానీ ఇక్కడ ఓ ఘటన మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. చనిపోయిన ఓ వ్యక్తిని పాడె ఎక్కించి ఊరు ఊరంతా డ్యాన్సులతో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వీరేంట్రా ఇలా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

వీడియో బట్టి.. అది ఒక చిన్న గ్రామంలా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని పాడెక్కించి ఆడ, మగ.. చిన్నా, పెద్దా ఇలా గ్రామస్తులంతా కలిసి డీజే పాటలు పెట్టి తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలో పాడెను ఆపి.. డీజే పాటలకు డ్యాన్సులు వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఒక పక్క మహిళలు, మరో పక్క పురుషులు డ్యాన్సులు వేస్తున్నారు. వారి వెనుక పాడెపై మృతదేహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక డ్యాన్సులు చేస్తున్న వారంతా.. నవ్వుకుంటూ.. చాలా సరదాగా.. సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

Advertisment
Advertisment
Advertisment