తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By BalaMurali Krishna 28 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి తెలంగాణ వాసులు మృతి.. ఏపీలోని తిరుపతి సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి కారులో అరుణాచలం, కాంచీపురం పుణ్యక్షేతాల్లో దైవదర్శనం కోసం ఆరుగురు వ్యక్తులు బయలుదేరారు. దర్శనం ముగించుకుని తిరుపతి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఎదురుగా ఉన్న బస్సును వేగంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో గంగాధర్ గౌడ్(49) అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై తరలించారు. మృతుల వివరాలు ఇవే.. హైదరాబాద్‌కు చెందిన వెంకట్ రెడ్డి(50), ఆర్మూర్ ప్రాంతానికి చెందిన అవినాష్ గౌడ్(23) మృతిచెందారు. క్షతగాత్రుల్లో ఆర్మూర్‌కు చెందిన రమేష్ గౌడ్(53), నర్సింగ్ రాజ్(44), బద్రి(23).. కొత్తపల్లికి చెందిన గంగాధర్ గౌడ్(49) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రమాదం గురించి సమాచారం అందిచామని పేర్కొన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంటే మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి