RGV: రేపే వ్యూహం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌..పవన్‌, చంద్రబాబు, లోకేష్‌కు ఆర్జీవీ ఆహ్వానం.!

విజయవాడలో రేపు వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. వ్యూహం సినిమాలో చంద్రబాబు అరెస్ట్, యువగళం, వివేకా హత్య వంటి సన్నివేశాలు ఉంటాయని తెలిపారు డైరెక్టర్‌ ఆర్జీవీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్‌, చంద్రబాబు, లోకేష్‌ను ట్విట్టర్‌ ద్వారా ఆహ్వానించారు.

New Update
RGV: రేపే వ్యూహం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌..పవన్‌, చంద్రబాబు, లోకేష్‌కు ఆర్జీవీ ఆహ్వానం.!

Ram Gopal Varma: విజయవాడలో రేపు వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు డైరెక్టర్‌ ఆర్జీవీ. వ్యూహం సినిమాలో చంద్రబాబు అరెస్ట్, యువగళం, వివేకా హత్య వంటి సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్‌, చంద్రబాబు, లోకేష్‌ను ట్విట్టర్‌ ద్వారా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యూహం మూవీలో ఎలాంటి వ్యూహం లేదన్నారు ఆర్జీవీ. సీఎం జగన్‌కు ఈ సినిమాతో ఎటువంటి సంబంధం లేదన్నారు. సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సీఎం జగన్‌ హాజరకావడం లేదని తెలిపారు. వ్యూహం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు రాజకీయ నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు వర్మ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన యువగళం గురించి సినిమాలో ఉంటుందని తెలిపారు. వైఎస్‌ వివేకా హత్య ప్రస్తావనం కూడా సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్ర గురించి పెద్దగా సినిమాలో ఉండదని కూడా క్లారిటీ ఇచ్చారు.

Also Read: పూంచ్ దాడుల వెనుక చైనా? షాకింగ్‌ విషయాలు చెప్పిన డిఫెన్స్‌!

ఈ మేరకు వ్యూహం పార్ట్‌-2శపథం జనవరి ఎండింగ్‌లోకి వస్తుందన్నారు ఆర్జీవీ. ఎన్నికల కోడ్‌ కంటే ముందే వ్యూహం, శపథం సినిమాలు విడుదలవుతాయని వెల్లడించారు. వ్యూహం సినిమా ఏపీ రాజకీయాలో సంచలనం సృష్టిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. 2009 నుంచి 2014 వరకు జగన్ కుటుంబంలో, ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశించినట్లు ఈ సినిమా ఉందని స్పష్టమవుతుంది. ఎన్నికలకు ముందు ఆర్జీవీ ఈ సినిమా తేదీని విడుదల చేయడంతో రాజకీయ నాయకులలో ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. బజగన్ కు అనుకూలంగా తీస్తున్న ఈ సినిమా జగన్ రాజకీయ భవిష్యత్, ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందని చాలా ఆసక్తిగా ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు