Boiler Blast: ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు..40 మంది..!

ధరుహెరాలో ఉన్న లైఫ్‌లాంగ్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు కారణంగా సుమారు 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

New Update
Boiler Blast: ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు..40 మంది..!

Blast:  పారిశ్రామిక పట్టణం ధరుహెరాలో ఉన్న లైఫ్‌లాంగ్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు కారణంగా సుమారు 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మంటలు తీవ్రంగా వ్యాపించాయి. పేలుడు సంభవించిన సమయంలో పైపుల నుంచి వెలువడిన రసాయనాల కారణంగా కార్మికుల శరీరాలు బాగా కాలిపోయాయి.

వారందరినీ ధరుహెరాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని రోహ్‌తక్‌ పీజీఐకి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ధరుహెరా పోలీసులు, అంబులెన్స్‌లు చేరుకుని కాలిపోయిన కార్మికులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం జరిగిన పారిశ్రామిక పట్టణంలో ఉన్న ఈ కంపెనీ టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల విడిభాగాలను తయారు చేస్తుంది. శనివారం ఉత్పత్తి పనులు జరుగుతుండగా ఒక్కసారిగా ప్లాంట్‌లో పేలుడు సంభవించింది.సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా కంపెనీలో ఒత్తిడి కారణంగా పైపు పగిలినట్లు గుర్తించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది స్థానికులు కాగా మరికొందరు ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు.

ప్రమాదం జరిగిన తరువాత, లైఫ్లాంగ్ కంపెనీ జనరల్ మేనేజర్, సుభాష్ రాణా మాట్లాడుతూ, ప్రెజర్ పైపు పగిలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. వాహనాల భాగాల నుండి మట్టిని తొలగించడానికి డస్ట్ క్లస్టర్ పైపులు ఉన్నాయి. వాటిలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు.

Also read : ఎగ్‌ కర్రీ వండలేదని సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి!

Advertisment
Advertisment
తాజా కథనాలు