పాలమూరు జిల్లా కేసీఆర్ చేతిలో మోస పోయింది...!

పాలమూరు జిల్లా సీఎం కేసీఆర్ చేతిలో మోస పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ దందా చూసినా బీఆర్ఎస్ నేతలే వున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. తొమ్మిదేండ్లయినా జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని తీవ్రంగా మండిపడ్డారు.

New Update

జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్​ఎస్ నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ పాలనలో అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి శూన్యమన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లు అమ్మైనా జిల్లాను అభివృద్ది చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. కానీ ముఖ్య మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాను అభివృద్ది చేయడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్​కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్, కేటీఆర్​కు వంద ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

జిల్లాలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏ దందాలో చూసినా బీఆరెస్ నేతలే కనిపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతల అరాచకాలను ఎదిరించేందుకు నేతలు ఈ రోజు కాంగ్రెస్​లో చేరడం అభినందనీయమన్నారు. మీ అందరికీ అండగా ఉంటానంటూ కొత్తగా చేరిన నేతలకు ఆయన హామీ ఇచ్చారు.

పోలీసులు అధికారులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహారించ వద్దని సూచించారు. అక్రమ కేసులు పెడితే మిత్తితో సహా చెల్లిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుందామన్నారు. ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్​ పార్టీ తీసుకుంటుందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు