Hyderabad: హైదరాబాదీలకు బిగ్ షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

హైదరాబాదీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ 31న రాత్రి ఒంటిగంట వరకే వేడుకలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని, డ్రంక్&డ్రైవ్‌లో దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

New Update
Hyderabad: హైదరాబాదీలకు బిగ్ షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

Restrictions New Year Celebrations: హైదరాబాదీలకు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకే వేడుకలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. అనుమంతించిన గడువు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్‌లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సెలబ్రేషన్స్‌కి 10 రోజులు ముందుగానే అనుమతి తీసుకోవాలన్నారు. ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు. ఈవెంట్ల దగ్గర సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రించేందుకు గార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. పబ్బుల్లో డ్యాన్సర్లతో కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేయవద్దన్నారు. డ్రగ్స్‌, గంజాయి రవాణపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. అంతేకాదు.. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయొద్దన్నారు. డిసెంబర్ 31 రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీపీ శ్రీనివాస్ రెడ్డి.

Also Read:

కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్‌.. రూల్స్‌ ఇవేనా?!

2024లో ఈ 4 రాశుల స్త్రీలకు పట్టిందల్లా బంగారమే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు