Renuka Chowdhury: హరీష్‌కు కాషాయ బట్టలు పంపుతాం.. రేణుక చౌదరి ఘాటు వ్యాఖ్యలు

TG: రుణమాఫీ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్పిన మాటపై నిలబడాలని అన్నారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరీష్‌కు కాషాయ వస్త్రాలు పంపుతామని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

New Update
Renuka Chowdhury: హరీష్‌కు కాషాయ బట్టలు పంపుతాం.. రేణుక చౌదరి ఘాటు వ్యాఖ్యలు

Renuka Chowdhury: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి. తమకు రాజకీయాలు అవసరం లేదని అన్నారు. రైతు సంక్షేమమే కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రైతు రుణమాఫీ చేస్తామన్న హామీని తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని పేర్కొన్నారు. హరీష్ రావుకు చేతనైతే చెప్పిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. హరీష్ రావు కు కాషాయ వస్త్రాలు పంపుతాం అని చురకలు అంటించారు. హరీష్ రావు రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుల సంస్కారం నేర్పిందే బీఆర్ఎస్ అని అన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెప్పారు.

రాజీనామా చేస్తా..

గతంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే తలనొప్పిగా మారాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ హరీష్ రావు సవాల్ చేశారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. కాగా తాజాగా రేవంత్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియను ఈరోజు నుంచి ప్రారంభించడంతో కాంగ్రెస్ శ్రేణులు హరీష్ రావు రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు