Rekha Naik: జాన్సన్ అసలు ఎస్టీనే కాదన్న రేఖా నాయక్..అగ్రవర్ణాలకే టికెట్లని సంచలన వ్యాఖ్యలు!!

బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో టికెట్ రాని వాళ్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఖానాపూర్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురికావాల్సి వచ్చిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని బీఆర్ఎస్ అధిష్టానం పై ఆమె ఫైర్ అయ్యారు. తాను గెలిచాక మంత్రి పదవి అడుగుతాననే సీఎం కేసీఆర్ ఈ సారి తనకు టికెట్ ఇవ్వలేదని ఆమె అన్నారు.

New Update
Rekha Naik: జాన్సన్ అసలు ఎస్టీనే కాదన్న రేఖా నాయక్..అగ్రవర్ణాలకే టికెట్లని సంచలన వ్యాఖ్యలు!!

Rekha Naik: బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో టికెట్ రాని వాళ్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఖానాపూర్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురికావాల్సి వచ్చిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని బీఆర్ఎస్ అధిష్టానంపై ఆమె ఫైర్ అయ్యారు.

తాను గెలిచాక మంత్రి పదవి అడుగుతాననే సీఎం కేసీఆర్ ఈ సారి తనకు టికెట్ ఇవ్వలేదని ఆమె అన్నారు. ఇక ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఫైనల్ చేసిన జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అగ్రవర్ణాలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

ఖానాపూర్లో నా సత్తా ఏంటో చూపిస్తా..!

అయితే తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న రేఖానాయక్ ఖానాపూర్లో తన సత్తా ఏంటో చూపిస్తానని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఇక ఎన్నికలకు 3 నెలలే ఉండడంతో అతిత్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. అయితే ఫస్ట్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్న అభ్యర్థులకు స్థానిక అసమ్మతి, కొంత వ్యతిరేకత తప్పడం లేదు. దీంతో చాలా చోట్ల అభ్యర్థులే అసమ్మతి నాయకులతో కలిసి వారి సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రేఖానాయక్ కాంగ్రెస్ వైపేనా..!

బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో రేఖానాయక్ దంపతులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రేఖానాయక్ భర్త కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలోనే రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు హ్యాండ్ ఇచ్చిన బీఆర్ఎస్ ఆమె స్థానంలో కేటీఆర్ కు దగ్గరగా ఉండే భూక్య జాన్సన్ నాయక్ కు సీటును కేటాయించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు