శీతాకాలంలో రేగిపండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షించడానికి రేగి పండు బాగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, ఎముకలను బలంగా చేయడంలోనూ ఈ పండు మంచి ఔషధంగా పని చేస్తుంది.

New Update
శీతాకాలంలో రేగిపండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!

అసలే చలికాలం...మరో పక్క వానలు పడుతున్నాయి. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిన్నంటికీ చెక్‌ పెట్టాలంటే ఈ సీజన్‌ లో దొరికే రేగిపండ్లను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం లో రేగిపండ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో విటమిన్‌ సీ, ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి.

చలికాలంలో జలుబు, దగ్గు లాంటి సమస్యలు సహజంగానే వస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కచ్చితంగా రేగిపండ్లను తింటే ఈ సమస్యను బయటపడవచ్చు. రేగిపళ్లను తొక్కతో పాటుగా తినడం వల్ల కాలేయానికి చాలా మంచిది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడమే కాకుండా ఆకలిని కూడా పెంచుతాయి.

శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. బలహీనంగా ఉన్నవారు తినడం చాలా మంచిది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో రేగిపళ్లు కీలక పాత్రను పోషిస్తాయి. రేగిపండ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగడం కోసం రక్తం ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. చలికాలంలో తలెత్తే డీ హైడ్రేషన్‌ కు చెక్‌ పెడతాయి.

విరేచనాలతో బాధపడుతున్న వారు రేగి చెట్టు బెరడును తీసి కషాయంలా చేసి తాగడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. రేగు పళ్లు , బెరడు మాత్రమే కాకుండా ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. బొబ్బలు, కురుపులు ఉన్న చోట రేగు ఆకులను చూర్ణంగా చేసి రాస్తే వెంటనే నయమవుతాయి. కఫము, పైత్యము , వాతం లాంటి సమస్యలు బాధిస్తుంటే రేగి పళ్లు మంచి పరిష్కారం.

రేగు పళ్లను ఒక అరలీటర్‌ వాటర్‌ లో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార, తేనె కలిపి దానిని రోజూ రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.బరువు పెరగడంలో , కండరాలకు బలాన్నివ్వడంలో రేగిపళ్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. రేగి పళ్లతో ఎండపెట్టి వడియాలు కూడా చేసుకుంటారు. ఎముకల్ని ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే వారు ఈ పండ్లు తినడం చాలా మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.

మలబద్దదకం ఉన్న వారు రేగిపళ్లు తినిపిస్తే చాలా మంచిది. శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు..మానసిక ఆరోగ్యానికి కూడా రేగిపళ్లు ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పళ్లలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి.చర్మం పై ముడతలను పొగొట్టి యవ్వనంగా కనిపించేలా రేగిపళ్లు చేస్తాయి.

Also read: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే!

Advertisment
Advertisment
తాజా కథనాలు