Gold Smuggling: బంగారం అక్రమ తరలింపుపై షాకింగ్ నిజాలు.. మూడేళ్లలో ఇప్పుడే అత్యధికం

దేశంలో బంగారం అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరిన బంగారం తరలింపు నిఘా వ్యవస్థకు సవాలుగా మారింది. గత మూడేళ్లతో పోలిస్తే అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఈ సారి భారీగా స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర గణాంకాల ద్వారా తెలుస్తోంది.

New Update
Gold Smuggling: బంగారం అక్రమ తరలింపుపై షాకింగ్ నిజాలు.. మూడేళ్లలో ఇప్పుడే అత్యధికం

Gold Smuggling: దేశంలో బంగారం అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరిన బంగారం తరలింపు నిఘా వ్యవస్థకు సవాలుగా మారింది. గత మూడేళ్లతో పోలిస్తే అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఈ సారి భారీగా స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి రాజ్యసభలో ఇచ్చిన సమాచారం ద్వారా ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.

ఇది కూడా చదవండి: టాలీవుడ్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్‌ ఇష్యూపై సీఎం రేవంత్ ఫోకస్

ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 4,795 కేసులు నమోదవగా.. 3,917.52 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2020 నుంచి బంగారం అక్రమ రవాణాకు సంబంధించి కేసుల వివరాలను రాజ్యసభలో మంత్రి వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022లో 3,502.16 కిలోల బంగారం సీజ్‌ చేసి 3,982 కేసులు నమోదు చేశారు. 2021లో 2,383 కిలోల బంగారం సీజ్‌ చేసి 2,445 కేసులు నమోదు చేశారు. 2020లో 2,155 కిలోల అక్రమ బంగారం సీజ్‌ చేసి 2,567 కేసులు నమోదు చేశారు. వీటితో పాటు భారతీయులతో కలిసి సిండికేట్లుగా పనిచేసే విదేశీయులకు సంబంధించి 2020 నుంచి ఏడు కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: తమిళనాడు ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో..!

కస్టమ్స్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమంగా బంగారం తరలింపుపై నిరంతరం నిఘా పెడుతున్నారని మంత్రి అన్నారు. ప్రయాణికులను క్షుణ్నంగా తనిఖీ చేయడంతో పాటు, ముఠాల కార్యకలాపాలపై నిఘాతో స్మగ్లింగ్ ను అరికడుతున్నామని మంత్రి పంకజ్ చౌదురి తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు