YCP: మళ్లీ విచారణకు డుమ్మా కొట్టిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు. రెండు వారాల సమయం కావాలని వారు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీంతో, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ నెలకొంది.

New Update
AP Politics: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ

YCP Rebel MLA's: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు విచారణకు హాజరుకావాలని రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే, ఈ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ నోటీస్ ను ఏ మాత్రం లెక్కచేయనట్లుగా తెలుస్తోంది. విచారణకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరుకాని పరిస్థితి కనిపిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం తన కార్యాలయంలో 12.30 వరకు ఎదురుచూసిన వారు మాత్రం విచారణకు హజరుకాలేదు.

Also Read: వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు.. మీ చేతకాని తనానికి ఇలా అడుగుతున్నారా? అంటూ ఫైర్

రెండు వారాలు సమయం కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తాము రాసిన లేఖకు కట్టుబడి ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, శ్రీదేవి గైర్హాజరు కావడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ హాజరుకావాలని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. దీంతో, వీరైనా హాజరవుతారా ? లేదంటే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల లాగా డుమ్మా కొడుతారా అనే ఉత్కంఠ కొనసాగుతుంది.

Also Read: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్‌ ..ఎలక్టోరల్‌ బాండ్స్‌ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

కాగా, గతంలో కూడా ఎమ్మెల్యేలను తన కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు జారీ చేసారు స్పీకర్ తమ్మినేని. అయితే, కేవలం ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీదేవి మాత్రమే విచారణకు హాజరయ్యారు. తమ అభిప్రాయం చెప్పేందుకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. స్పీకర్ విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరారు. ఇచ్చిన నోటీసుల పైన తమకు మెటీరియల్ కావాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు