Indravelli Incident: చరిత్రలో చెరగని రక్తపు మరక ఇంద్రవెల్లి @ 43.. అసలు ఆ రోజు ఏం జరిగింది?

నెత్తుటి మరకలు ఆరని ప్రాంతమది.. చరిత్రలో చెరగని రక్తపు మరక.. ఇంద్రవెల్లి మారణకాండ..! ఘటన జరిగి 43ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ నాటి పీడకలలను అక్కడి గిరిజనులు తలుచుకోని రోజే ఉండదు. అసలు ఆ నాడు ఏం జరిగింది? తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Indravelli Incident: చరిత్రలో చెరగని రక్తపు మరక ఇంద్రవెల్లి @ 43..  అసలు ఆ రోజు ఏం జరిగింది?

Indravelli Incident: హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం అయినప్పుడు ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కిందకు వచ్చాయి. ఇది గిరిజనుల భూములను ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది. 1959లో భూమి బదలాయింపు చట్టం తీసుకువచ్చారు. 1970లో‌ ఈ చట్టానికి మార్పులు చేశారు. అయితే చట్టాలు ఎంత పకడ్బందీగా ఉన్నా అమలు చేయడంలో నిర్లక్ష్యం జరిగింది. 70వ దశకంలో ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణలోని గిరిజన ప్రాంతానికి వ్యాపారాల నిమిత్తం వచ్చిన వారు ఎక్కువయ్యారు. ఈ వ్యాపారులు అక్కడే స్థిర పడిపోయారు. స్థానిక గిరిజనుల చేతుల్లో ఉండాల్సిన భూమి,అటవి సంపద చేతులు మారాయి. గిరిజనుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఈ వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం ఇంద్రవెల్లిలో సరిగ్గా నాడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.

ఈ దోపిడీ, అన్యాయం, ఆక్రమణలను వ్యతిరేకిస్తూ గిరిజనులంతా మెల్లగా ఒక్కటవ్వడం మొదలు పెట్టారు. మావోయిస్టు ప్రభావం, అలాగే గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంఘటితం అవ్వడం మొదలెట్టారు అక్కడి జనాలు. తమ మీద జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ మీద అవగాహన కలగడం మొదలైంది. ఆ క్రమంలో ఎప్రిల్ 20,1981 నాడు గిరిజనులంతా ఒక్కటై సభ నిర్వహించాలని గిరిజన రైతు కూలీ సంఘం పిలుపునిచ్చింది.

ఏప్రిల్ 20,1981 సోమవారం. ఆరోజు సంత కూడా ఉండటంతో వివిధ గూడాల నుండి జనాలు వచ్చారు. మరోవైపు సభలో పాల్గొనేందుకు ముందుగానే తుడుం కొట్టి దండోరా వేయించారు. దాంతో కేస్లాపూర్, నర్సాపూర్, పిట్ట బొంగారం,ఉట్నూరు, ముట్నూరు, పాటగూడ, తుమ్మగూడ గ్రామాల నుంచి వేల మంది గిరిజనులు కొండా కోన దాటుకుని వచ్చారు. దీంతో ఇంద్రవెల్లిలో జనాల సంఖ్య ఎక్కువైంది.

అటు ముందుగా సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేసుకున్నారు. కానీ ఈ సమాచారం అటవీ ప్రాంత ప్రజలకు, చాలా మంది గిరిజనులకు అందలేదు. ఇంద్రవెల్లికి వెళ్లే దారులను అప్పుడు మూసేశారు. అక్కడికి చేరుకుంటున్న కొందరిని అరెస్టులు చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత లాఠీచార్జీ చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా అలజడి రేగింది. సభ‌ నిర్వహనను అడ్డుకుంటున్న పోలీసులపై తిరగబడ్డారు జనం.‌

కాసేపటికే‌ పోలీసులు కాల్పులు జరిపడం మొదలు పెట్టారు.‌ అక్కడే ఉన్న మామిడి చెట్లు ఎక్కి మరీ జనాల్ని కాల్చారు. వారినుంచి తప్పించుకొనికి సమీప గ్రామాలకు, అడవిలోకి పరిగెత్తారు జనాలు. ఆ రోజు పచ్చని అడవి ప్రాంతం కాస్తా రక్త సంద్రం అయ్యింది. పోలీసులు సృష్టించిన మారణకాండతో ఎక్కడ చూసినా శవాలు, గాయపడిన ప్రజలతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది.

ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.‌ ప్రభుత్వం ఈ ఘటనలో 13 మంది మరణించారని చెప్పింది. అయితే వార్తా సంస్థలు ఈ సంఖ్య ఎక్కువే అని ప్రచూరించాయి. గిరిజనులు, హక్కుల నేతలు, వివిధ సంఘాల నాయకుల నుంచి దీని మీద తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో నిజ నిర్ధారణ కమిటీ బృందం ఆధ్వర్యంలో లెక్కలు తీశారు. దాదాపు 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తేల్చారు.

ఈ ఘటనను అప్పుడు జలియన్ వాలా బాగ్ మారణకాండతో పోల్చూతు అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. స్వతంత్ర భారతంలో ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదు. 1983లో ఇంద్రవెల్లిలో చనిపోయిన వారి గుర్తుగా కాల్పులు జరిగిన ప్రాంతంలో స్థూపాన్ని నిర్మించారు. అయితే 1986లో ఆ స్థూపాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పేల్చేశారు. గిరిజనుల్లో తీవ్ర ఆవేశాలకు లోను కాకుండా ఉండడానికి అప్పటి ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో మళ్ళీ స్థూపాన్ని కట్టించింది. ఇంత పెద్ద పోరాటం తర్వాత ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ గిరిజనుల బాధాలు అలానే ఉన్నాయి..!

Also Read: Hanuman Janmotsav: శని దోష నివారణకు.. హనుమాన్ జయంతి రోజున ఈ పరిహారాలు చేయండి..?

Advertisment
Advertisment
తాజా కథనాలు