జనవరిలో ఆయోధ్య రామయ్య దర్శనం... ఐదు నెలల ముందే పెరిగిన హోటల్ ధరలు....!

అయోధ్య రామాలయ నిర్మాణ పనులు చకా చకా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి భక్తులకు అయోధ్య రామయ్య దర్శన భాగ్యం కలిగేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు .దీంతో ఐదు నెలల ముందుగానే అయోధ్యలో హోటల్స్ ధరలు భారీగా పెరిగి పోయాయి.

New Update

publive-image

2024 జనవరి 20 నుంచి జనవరి 26 మధ్యలో బుకింగ్ రిక్వెస్ట్‌లు ఎక్కువగా వస్తున్నట్టు హోటల్స్ యజమానులు చెబుతున్నారు. ట్రావెల్ ఏజెంట్లు ఇప్పటి నుంచే బుకింగ్స్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. డిమాండ్ ను బట్టి రేట్లు పెంచినా ఏజెంట్లు వెనక్కి తగ్గడం లేదన్నారు. ధర ఎక్కువగా వున్నప్పటికీ హోటల్స్ ను బుక్ చేస్తున్నట్టు చెబుతున్నారు.

ప్రముఖ హోటల్స్ తో పోలిస్తే చిన్న హోటల్స్ బాగా ధరలు పెంచుతున్నాయి. ప్రముఖ హోటల్స్ లో ధర రూ. 2500 వరకు ఉంది. అదే చిన్న హోటల్స్ లో రూ. 4 వేల వరకు రూమ్ రేట్లను ఫిక్స్ చేశారు. ప్రముఖ హోటల్స్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిట లాడుతుంటాయని, అందువల్ల అవి ఛార్జీలు పెంచడం లేదని చెబుతున్నారు. చిన్న హోటల్స్ కు ఇలాంటి సందర్బాల్లో మాత్రమే డిమాండ్ వుంటుందని అందుకే ధరలు పెంచుతున్నామంటూ వెల్లడిస్తున్నాయి.

ఇది ఇలా వుంటే 2024 జనవరి 15 నుంచి 24 మధ్య శ్రీరామ చంద్రుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తుల కోసం రామమందిరం తలుపులు తెరుస్తామని వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు