Ram Narain Agarwal: అధికార లాంఛనాలతో రామ్ నారాయణ్ అగర్వాల్ అంత్యక్రియలు

అగ్ని క్షిపణి పితామహుడు, ప్రముఖ డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో ఆగస్టు 17వ తేదీ శనివారం నాడు వీరి అంత్యక్రియలు జరగనున్నాయి.

New Update
Ram Narain Agarwal: అధికార లాంఛనాలతో రామ్ నారాయణ్ అగర్వాల్ అంత్యక్రియలు

Ram Narain Agarwal: అగ్ని క్షిపణి పితామహుడు, ప్రముఖ డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఆగస్టు 15న కన్నుమూశారు.  వీరి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లో ఆగస్టు 17 వ తేదీ శనివారం నాడు వీరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరుగనున్నాయని ఉత్తర్వులు జారీ చేశారు.

పద్మశ్రీ, భూషణ్ 

రక్షణ రంగంలో డా. అగర్వాల్ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1990 లో పద్మశ్రీ, 2000 లో పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. డా. ఆర్.ఎం.అగర్వాల్ 1983 లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక భారత మిస్సైల్ కార్యక్రమంలో డా. అరుణాచలం, డా. ఏ.పీ.జె. అబ్దుల్ కలాంలతో కలసి పనిచేశారు.

హైదరాబాద్ లో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబరేటరీ (ASL )వ్యవస్థాపక డైరెక్టర్ గా అగర్వాల్ పనిచేసారు. 2005 లో డిఫెన్స్ రీసర్చ్, డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో విశిష్ట శాస్త్ర వేత్తగా పదవీ విరమణ చేశారు. పదవి విరమణ తర్వాత డా. రామ్ నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకొని చివరి క్షణం వరకు రక్షణ రంగానికి సేవలందించారు. భారత లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాలజీ రంగంలో దేశం స్వయం ప్రతిపత్తి సాధించడంలో విశేష సేవలందించారు.

Also Read: Fater Of Agni Missile: ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ రామ్ నరైన్ కన్నుమూత - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు