Harish Rao: ఆత్మీయబంధానికి ప్రతీక రక్షాబంధన్..’ ఏకో ఫ్రెండ్లీ రాఖీ’ నే కట్టండి..!

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్లాస్టిక్ తో తయారు చేసే రాఖీలు కాకుండా సహజసిద్ధంగా ఉండే ఆకులు, పువ్వులతో తయారు చేసిన ఏకో ఫ్రెండ్లీ రాఖీలను ఈ ఏడాది నుంచి తమ్ముళ్లకు, అన్నయ్యలకు కట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు ఆయన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

New Update
Harish Rao: ఆత్మీయబంధానికి ప్రతీక రక్షాబంధన్..’ ఏకో ఫ్రెండ్లీ రాఖీ’ నే కట్టండి..!

Harish Rao:రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్లాస్టిక్ తో తయారు చేసే రాఖీలు కాకుండా సహజసిద్ధంగా ఉండే ఆకులు, పువ్వులతో తయారు చేసిన ఏకో ఫ్రెండ్లీ రాఖీలను ఈ ఏడాది నుంచి తమ్ముళ్లకు, అన్నయ్యలకు కట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు ఆయన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బందన్ అని అన్నారు. ఇక సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలించేందుకు సిద్దిపేటలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని.. కాబట్టి రాఖీ పండుగ రోజున కూడా ప్లాస్టిక్ తో తయారు చేసిన రాఖీలను వాడకుండా సహజసిద్దంగా తయారు చేసిన రాఖీలను వాడాలన్నారు ఆయన.

సిద్దిపేట నియోజకవర్గం మహిళలు అన్నింట్లో స్పూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఇక ఆరోగ్యం పట్ల ఆలోచించి మహిళలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రశంసించదగ్గ విషయమన్నారు మంత్రి హరీశ్ రావు.

ఇది కూడా చదవండి..కేసీఆర్ ఎమ్మెల్యేలను.. పశువులను సంతంలో కొన్నట్టుగా కొనుగోలు చేశారు:జూపల్లి

Advertisment
Advertisment
తాజా కథనాలు