సీఎంతో కలిసి జైలర్ సినిమా వీక్షించనున్న తలైవా రజనీ కాంత్...!

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దెబ్బకు గత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. జైలర్ సినిమాను తాను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ఆదివారం వీక్షించనున్నట్టు తళైవా రజనీకాంత్ తెలిపారు.

author-image
By G Ramu
New Update

యూపీ రాజధాని లక్నోలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తో ఆయన రేపు భేటీ కానున్నట్టు వెల్లడించారు. సీఎంతో కలిసి జైలర్ సినిమాను చూడనున్నట్టు పేర్కొన్నారు. బాక్సాఫీస్ వద్ద తన సినిమా బంపర్ కావడం భగవంతుని దయే అని అన్నారు.

అదంతా దేవుని ఆశీర్వాదం వల్లే జరిగిందన్నారు. ఈ నెల 18 నుంచి 20 వరకు రాష్ట్రంలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శించనున్నారు. అయోధ్యతో పాటు కాశీ, మధురా ఆలయాలను ఆయన సందర్శించనున్నారు.

ఈ నెల 12న ఉత్తరాఖండ్ లోని బద్రీనాధ్ దామ్ వెళ్లారు. ఆ మరుసటి రోజు గణేశ్ గుహ, వ్యాస గుహ, మనా గ్రామాల్లో పర్యటించి ఆలయ విశిష్టతలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి జార్ఖండ్ వెళ్లారు. అక్కడ యోగా సత్సంగ్ ఆశ్రమంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు