కమలం గూటికి టాలీవుడ్ తారల క్యూ..ఢిల్లీ బయల్దేరిన జయసుధ..దిల్ రాజు కోసం గట్టిగా ట్రై చేస్తున్న టీబీజేపీ!

ఎన్నికలకు ముందు పార్టీలకు సినీ గ్లామర్ మస్ట్. ఇక ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు రాజకీయాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటే  బాగుంటుందని భావిస్తుంటారు. దీంతో సినీ తారలను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు. ఈ నేఫథ్యంలో బీజేపీ లో చేరుతున్న నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ. హీరో నితిన్, స్టార్ ప్రొడ్యూసర్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా జోరుగా ప్రచారం. ఆల్రెడీ నడ్డాతో మీట్ అయిన నితిన్. కాని కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగే ఛాన్స్.. దిల్ రాజుకు బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఆఫర్..!

New Update
కమలం గూటికి టాలీవుడ్ తారల క్యూ..ఢిల్లీ బయల్దేరిన జయసుధ..దిల్ రాజు కోసం గట్టిగా ట్రై చేస్తున్న టీబీజేపీ!

ఎన్నికలకు ముందు పార్టీలకు సినీ గ్లామర్ మస్ట్. ఇక ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు రాజకీయాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటే  బాగుంటుందని భావిస్తుంటారు. దీంతో ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమయ్యేటప్పుడు మాత్రమే సినీ తారలు తమకు అనుకూలంగా ఉండే పార్టీ కండువాను కప్పేసుకుంటుంటారు. అయితే క్యాంపెయింగ్ కు ఈజీగా ఉంటుందని..ఇక ఫాలోయింగ్ మరీ ఎక్కువగా ఉంటే.. టికెట్ ఇచ్చినా వర్కౌట్ అవుతుందని పార్టీలు భావిస్తుంటాయి.

దీంతో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సినీ తారలతో ఆయా పార్టీలు టచ్ లోకి వెళ్ళడం.. వారిని పార్టీలోకి ఆహ్వానించడం.. వారికి ప్రచార బాధ్యతలు అప్పగించడం.. లేక ప్రత్యేక ప్యాకేజీలు కేటాయించడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ చేరికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇక సినీ గ్లామర్ ను క్యాచ్ చేసే విషయంలో టీబీజేపీ కాస్త ముందడుగులోనే ఉంది. ఈ క్రమంలో సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలోకి చేరుతున్నారు.

ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు జాతీయ నేతల సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో ఆమె ఈ రోజు (ఆగష్టు 2) ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రంలో పార్టీలో చేరనున్నారు.ఇక పార్లమెంట్ సమావేశాలు నడుస్తుండడంతో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇంకా డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పలువురు ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, సునీల్ బన్సల్ కూడా అక్కడే ఉండడంతో వీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అయితే జయసుధ గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె సికింద్రాబాద్ కాని, ముషీరాబాద్ కాని టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. మరి ఆమెకు అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చిందనే తెలియాలంటే వేచి ఉండాల్సిందే. మరో వైపు హీరో నితిన్ కూడా బీజేపీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఆల్రెడీ నితిన్ గతంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యాడు. కాని ఆయన కుటుంబ రాజకీయ నేపథ్యం దృష్ట్యా కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో.. దిల్ రాజు వర్సెస్ నితిన్ అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇద్దరి నేటివ్ కూడా నిజామాబాదే కావడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. నితిన్ ను ఆర్థికంగా ఎదుర్కొనే దమ్ము కూడా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఉండడంతో  ఆయన్ని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక వేళ నితిన్ కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగితే ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నుంచి దిల్ రాజును దింపాలని స్కెచ్ వేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా అదే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ నుంచి నితిన్ దిగితే..దిల్ రాజును రంగంలో దింపాలని ఆయనతో మంతనాలు చేస్తోంది. అయితే దిల్ రాజుకు రెండు పార్టీలతో కూడా సత్సంబంధాలున్నాయి. దీంతో ఆయన ఇప్పటి వరకు ఎవరికి ఓకే అని చెప్పలేదు. అయితే ఈ విషయంలో బీజేపీ గట్టిగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కాని ఫలిస్తే.. దిల్ రాజు కూడా కమలతీర్థం పుచ్చుకోనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు