Purandeswari: మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు: పురందేశ్వరి

వాగ్దానాలన్నీ నెరవేర్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పురందేశ్వరి. రాష్ట్రమంతా కల్తీ స్పిరిట్ ని సప్లై చేస్తున్నారని జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Purandeswari: మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు: పురందేశ్వరి

Purandeswari: వైసీసీ ప్రభుత్వంపై రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పురందేశ్వరి కౌంటర్లు వేశారు. జగన్ ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉండాలంటారని అయితే, ఆ ఫ్యాన్ స్పీడు 150 పెట్టడంతో ఇంటి పైకప్పుతో పాటు చుట్టుపక్కల గోడలు కూడా పడిపోయే పరిస్థితి వచ్చిందని కామెంట్స్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కుటమి పాలన ప్రజలకు అత్యవసరం పురందేశ్వరి పేర్కొన్నారు.

Also Read: ఆ ఇద్దరి నేతలను రోడ్డుపై బట్టలు ఊడదీసి ఇలా చేయ్యాలి: రవికుమార్

వాగ్దానాలన్నీ నెరవేర్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పురందేశ్వరి. రాష్ట్రమంతా కల్తీ స్పిరిట్ ని సప్లై చేస్తున్నారని ఆరోపించారు.  గతంలో 150 రూపాయలకు దొరికే మద్యం బాటిల్ ఇప్పుడు 600 నుంచి 700 రూపాయలు ఆమ్ముతున్నారన్నారు. ప్రజల జీవితాలు ఎలా పోయినా పర్లేదు వీళ్ళ జేబులు మాత్రం నిండాలని విమర్శలు గుప్పించారు.

Also Read: అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారు.. కొణతాల కీలక వ్యాఖ్యలు!

రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. రూ 12.50 లక్షల కోట్లు అప్పు భారం ఆంధ్రప్రదేశ్ పై ఉందని వెల్లడించారు. ప్రాంతీయ విభేదాలను తీసుకొచ్చి మూడు రాజధానులతో ప్రజలను మూడు ముక్కలు చేద్దామని ఈ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఆత్తారింటికి దారేదీ సినిమాలాగా జగన్ ని నల్లమల్ల అడవుల్లో నిలబెట్టి మాట్లాడిస్తే ప్రతి చెట్టు ఆకు రాలిపోయి అడవి అంత నిర్మానుష్యంగా అయిపోతుందని ఎద్దేవ చేశారు. అంతా అబద్దల పుట్ట ఈ జగన్ అని దుయ్యబట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తిరుమలలో నిలువు దోపిడీ.. తలనీలాలకు రూ.100.. వీడియో ఇదిగో!

తిరుమలలో శ్రీవారికి కొందరు తలనీలాలు సమర్పించే దగ్గర ఎలాంటి డబ్బులు కూడా తీసుకోరు. అంతా ఉచితమే. కానీ కొందరు క్షురకులు తిరుమల కళ్యాణకట్టలో భక్తుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

New Update
Tirumala kalyana katta

Tirumala kalyana katta

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాది అంతా భక్తులు వెళ్తుంటారు. ఏ సమయంలో వెళ్లినా కూడా భక్తులతో తిరుమల కలకలలాడుతుంది. అయితే శ్రీవారికి కొందరు తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలు సమర్పించే దగ్గర ఎలాంటి డబ్బులు కూడా తీసుకోరు. అంతా ఉచితమే. కానీ కొందరు క్షురకులు మాత్రం భక్తుల నుంచి లంచం తీసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

ఓ నెటిజన్ వీడియో తీసి..

తిరుమల కళ్యాణకట్టలో భక్తుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీటీడీ దయచేసి దీనిపై దృష్టి పెట్టండని తెలిపారు. భక్తులు ఇష్టపూర్వకంగా డబ్బు ఇస్తే సమస్య కాదని.. భక్తులు కార్మికులకు ఎల్లప్పుడూ కూడా మద్దతు ఇస్తారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఇదిలా ఉండగా.. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో చాలామంది దైవదర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఎక్కువమంద తిరుమలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్కువమంది బస్‌లు, ట్రైన్‌లలో వెళ్తున్నప్పటికీ తిరుమతితో పాటు ఇతర ప్రాంతాలను దర్శించుకోవాలనుకునేవారు కార్లలో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

వేసవికాలం కావడంతో కార్లలో వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సూచిస్తున్నారు.  ఇటీవల ఎండాకాలం లో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి పలు కారణాలున్నాయి. కాబట్టి తమ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు.

Advertisment
Advertisment
Advertisment