నోరు విప్పని ప్రభుత్వ విప్‌.. రిపోర్టర్‌ను తోసేస్తూ వెళ్లిన వైనం

ప్రభుత్వ విప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆర్టీవి ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. బాల్క సుమన్‌ ఎలాంటి ఆన్సర్‌ ఇవ్వలేదు. అంతేకాదు ఆర్టీవీ రిపోర్టర్‌ ప్రశ్నిస్తుంటే అతన్ని తోసివేస్తే వెళ్లాడు. కాగా బాల్క సుమన్‌ కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

New Update
నోరు విప్పని ప్రభుత్వ విప్‌.. రిపోర్టర్‌ను తోసేస్తూ వెళ్లిన వైనం

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్, దివంగత నేత సాయిచంద్‌ సంతాప సభ సోమవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. సాయిచంద్‌ స్వగ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రులు సాయిచంద్‌ చెల్లి వేదాకు, తండ్రి రాములుకు చెరో 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కాగా ఇటీవలప్రభుత్వ విప్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాడంతో ఆ విషయంపై ఆర్టీవీ బాల్క సుమన్‌ను ప్రశ్నించే ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకొని తిరిగాడు. ఆర్టీవీ బీఆర్‌ఎస్ కోవర్టుల గురించి మరోసారి ప్రశ్నించే ప్రయత్నం చేయగా ఎంతకీ నోరు విప్పని బాల్క సుమాన్‌ ఆర్టీవీ రిపోర్టర్‌ను తోసేస్తూ వెళ్లిపోయాడు. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు బాల్క సుమన్‌ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

కాగా కాంగ్రెస్‌లోకి తామే బీఆర్ఎస్‌ లీడర్లను పంపామని, కాంగ్రెస్‌ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, వారినేమీ అనొద్దని కాగా బాల్క సుమన్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం తనకు చెన్నూరు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని వాళ్ల ఎమ్మెల్యే ఒప్పుకున్నాడని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

దీంతో దిద్దుబాటు చర్యలకు సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగారు. సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అనవసరంగా బీజేపీకి అస్త్రం ఇచ్చినట్టు అయ్యిందంటూ BRS నేతలే విమర్శలు చేస్తున్నారు. కాగా 2014లో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీచేసిన సుమన్ ఆ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2018లో చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ చెన్నూరు నుంచి మరోసారి పోటీ చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు