తెలంగాణ సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్..సీఎం కేసీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళి!

తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్..తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు కేసీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు.

New Update
తెలంగాణ సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్..సీఎం కేసీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళి!

తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్..తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు కేసీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగం ఇంకా సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

సకల జనుల సంక్షేమం, సబ్బండ వర్గాల సమానత్వం కోసమే తెలంగాణ స్వరాష్ట్రమని తెలిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరేవేరుస్తున్నదని తెలిపారు కేసీఆర్. రాష్ట్రాన్ని సాధించిన తొమ్మిదేళ్ల కాలంలోనే సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ నేడు దేశానికే ఆదర్శంగా తెలంగాణ పాలన సాగుతోందని, అలాగే సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.

వ్యవసాయ రంగం నుంచి ఐటీ, ఇతర సాంకేతిక రంగాల వరకు అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. ప్రపంచదేశాలు కూడా ఇవాళ తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి సాక్షాత్కారమైందన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా.. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న సకలజనుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Advertisment
Advertisment
తాజా కథనాలు