ఢిల్లీ తెలంగాణ భవన్ లో.. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు..!

ఢిల్లీ తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ సిద్దాంతకర్త  ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్  డా. గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అందరూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి  నివాళుర్పించారు.

New Update
ఢిల్లీ తెలంగాణ భవన్ లో.. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు..!

ఢిల్లీ తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ సిద్దాంతకర్త  ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. ఆయాచితం శ్రీధర్, వివిధ జిల్లాల గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్  డా. గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అందరూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి  నివాళుర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. జయశంకర్‌ సార్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ర్టాన్ని సాధించుకొన్నామని  పేర్కొన్నారు. ఆయన ఆశించినట్టుగానే స్వయంపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలను సాకారం చేస్తున్నదని పేర్కొన్నారు.

ఇక రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. ఆయాచితం శ్రీధర్  మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌గా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను, కష్టాలను వివరిస్తూ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ఆయన రగిలించారని, సార్ స్ఫూర్తితోనే.. ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ర్టాన్ని సాధించుకున్నామని  ఆయన తెలిపారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్..తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు కేసీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగం ఇంకా సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

సకల జనుల సంక్షేమం, సబ్బండ వర్గాల సమానత్వం కోసమే తెలంగాణ స్వరాష్ట్రమని తెలిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరేవేరుస్తున్నదని తెలిపారు కేసీఆర్. రాష్ట్రాన్ని సాధించిన తొమ్మిదేళ్ల కాలంలోనే సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ నేడు దేశానికే ఆదర్శంగా తెలంగాణ పాలన సాగుతోందని, అలాగే సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు