రేపు రాష్ట్రపతితో విపక్ష ఎంపీల భేటీ.... ఎందుకంటే...!

author-image
By G Ramu
New Update
రేపు రాష్ట్రపతితో విపక్ష ఎంపీల భేటీ.... ఎందుకంటే...!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విపక్ష ఎంపీలు బుధవారం భేటీ కానున్నారు. రేపు ఉదయం 11. 30 గంటలకు రాష్ట్రపతితో విపక్ష ఎంపీలు సమావేశం అవుతారు. మణిపూర్ అంశంపై చర్చించేదుకు విపక్షాలకు సమయం ఇవ్వాలన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు రాష్ట్రపతి వారికి సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇటీవల మణిపూర్ లో పర్యటించిన విపక్ష పార్టీల 21 మంది ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వారితో పాటు ఇండియా కూటమిలోని పార్టీల ఫ్లోర్ లీడర్లు కూడా భేటీలో పాల్గొంటారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని డిమాండ్ చేయనున్నట్టు పేర్కొన్నారు.

మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించాలని రాష్ట్రపతిని కోరతామన్నారు. మణిపూర్ అంశంపై చర్చకు సమయం ఇవ్వాలని విపక్షాల తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కోరారు.

మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని విపక్షాలు కోరుతున్నాయి. ఈశాన్య రాష్ట్రంలో హింస ఇంకా కొనసాగుతోందని విపక్షాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ హింసలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇప్పటికే విపక్ష సభ్యుల బృందం మణిపూర్ లో పర్యటించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు