Prathipati Pulla Rao : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అరెస్ట్..14 రోజుల రిమాండ్! మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్ ను న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి. శరత్ కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. By Bhavana 01 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ex Minister Prathipati Pulla Rao : టీడీపీ(TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) కుమారుడు శరత్(Sharath) ని పోలీసులు అరెస్ట్(Arrest) చేసిన సంగతి తెలిసిందే. ఆయన జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపు చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న క్రమంలో ఆయన పై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలెజిన్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి భార్య, కుమారుడితో పాటు ఆయన బావమరిది సహా మరో ఏడుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు శరత్ ను హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) లో అదుపులోనికి తీసుకుని విజయవాడ(Vijayawada) కు తీసుకుని వచ్చారు. ఆ తరువాత శరత్ ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయం, కమాండ్ కార్యాలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో కుమారుడి ఆచూకీ తెలియడం లేదని మాజీ మంత్రి పుల్లారావు ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్, పట్టాబి, దేవినేని ఉమా పుల్లారావు నివాసానికి చేరుకోగా వారిని చూసి పుల్లారావు కన్నీంటి పర్యంతమయ్యారు. జగన్ ప్రభుత్వం(Jagan Sarkar) తన కుమారుడి పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయనని టీడీపీ నేతలు ఓదార్చి ధైర్యం చెప్పారు. శరత్ అరెస్ట్ ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్థరాత్రి పోలీసులు శరత్ ను న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి. శరత్ కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్(14 Days Remand) విధించినట్లు తెలిపారు. అనంతరం శరత్‌ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు . ఆయన ట్విట్టర్(X) లో జగన్ పై విమర్శలు గుప్పించారు. ” మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జగన్ తాడేపల్లి ముఠానా? టెర్రరిస్టుని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? శరత్‌కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి తప్పదని, బలమైన టిడిపి నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం. శరత్‌ని తక్షణమే విడుదల చేయాలి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తాం. జగన్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్టలు ఆపకపోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.” అంటూ రాసుకొచ్చారు. Also Read : ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి! #tdp #prathipati-pulla-rao-son #sharath #hyderabad-airport మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి