Balineni : జగన్‌కు మాజీ మంత్రి షాక్.. నేడు పవన్‌తో వైసీపీ నేత భేటీ!

AP: ఈరోజు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. నిన్న బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

author-image
By V.J Reddy
New Update
BALINENI

Balineni Srinivasa Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఉన్నట్టుండి సడెన్ గా నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. అయితే, కేబినెట్ నుంచి తొలిగించినప్పటి నుంచి బాలినేని జగన్ తో పాటు పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం సాగింది. ఎన్నికలకు ముందే బాలినేని పార్టీ మారుతారనే చర్చ కూడా జరిగింది. కానీ ఆనాడు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించి.. తన రాజకీయ ప్రయాణం జగన్ తోనే అని స్పష్టం చేశారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసి గతంలో జరిగిన పార్టీ మార్పు ప్రచారాన్ని నిజం చేశారు. 

Also Read :  మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు!

నేడు పవన్‌తో..

వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని గతం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఉండేవి. తాజాగా వైసీపీ కి రాజీనామా చేయడంతో.. ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడిచింది. కాగా పుకార్లకు ఎక్కువ సమయం ఇచ్చేందుకు ఇష్టపడని బాలినేని తాను జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తన కేడర్ కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈరోజు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారు ఇద్దరు నేతలు. తాను ఏ రోజు జనసేనలో చేరాలన్న దానిపై ఈరోజు బాలినేని క్లారిటీ ఇవ్వనున్నారు.

Also Read :  లెబనాన్‌లో పేలుతున్న వాకీ టాకీలు.. 9మంది మరణం

జగన్‌కు రాసిన లేఖలో..

“కొన్ని కారణాల రీత్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. రాష్ట్రం ప్రగతి పదం లో వెళ్తే ఖచ్చితం గా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను, కారణం అంతిమంగా ప్రజాశ్రేయస్సే.. రాజకీయాలకు కొలమానం కదా విలువలను నమ్ముకొని దాదాపు 5 సార్లు ప్రజా ప్రతినిధిగా 2 సార్లు మంత్రి గా పని చేసాను అన్నతృప్తి, కొంత గర్వం కూడా ఉంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు, వై. ఎస్. ఆర్. కుటుంబానికి సన్నిహితుడుని అయినా ఇపుడు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనపుడు ఖచ్చితంగా అడ్డుకొన్నా ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు.

అంతిమం గా ప్రజాతీర్పుని ఎవరైనా హుందా గా తీసుకోవాల్సింది. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్చే నాకు శిరోధార్యం రాజకీయాల్లో భాష గౌరవం గా హుందాగా ఉండాలని నమ్మే నికార్సైన రాజకీయం నేను చేసాను, కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శం గా తీసుకొన్నపుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన భాద్యత మనది. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను” అని పేర్కొన్నారు.

Also Read :  దీపావళి బంపర్‌ బోనాంజ…ఉచిత గ్యాస్ సిలిండర్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు