Poster War: తెలంగాణలో పోస్టర్ల రాజకీయం.. బుక్ మై సీఎం.. కానీ షరతులు వర్తిస్తాయి

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో వరుస పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పార్టీలను విమర్శిస్తూ పోసర్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లో స్కాంగ్రెస్ అంటూ పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరో రెండు పోసర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మరో పోస్టర్ కూడా దర్శనమిస్తుంది.

New Update
Poster War: తెలంగాణలో పోస్టర్ల రాజకీయం.. బుక్ మై సీఎం.. కానీ షరతులు వర్తిస్తాయి

Poster War: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో వరుస పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పార్టీలను విమర్శిస్తూ పోసర్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లో స్కాంగ్రెస్ అంటూ పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరో రెండు పోసర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మరో పోస్టర్ కూడా దర్శనమిస్తుంది. 2004- 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఎస్సీ విభజనపై దళితులను మోసం చేస్తూ వచ్చిందని పోస్టర్లో పేర్కొ్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్సీ డిక్లరేషన్‌తో ముందుకు వచ్చిందని మళ్లీ ఇదే మోసం కావాలా అంటూ ప్రశ్నించారు. అటు సీఎం కేసీఆర్‌పై సైతం ఇదే విధంగా పోస్టర్లు అంటించారు. బుక్ మై సీఎం, డీల్స్ అవైలబుల్ కానీ 30 శాతం కమీషన్ అని అందులో పేర్కొన్నారు. ఈ పోసర్లు ఎవరు అంటించారనేది మాత్రం తెలియరాలేదు.

ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్లు వెలవడం టీకాంగ్రెస్‌ నేతల్లో కలకలం సృష్టిస్తోంది. సోనియాగాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని గతంలో అన్న మాటలు పోస్టర్ రూపంలో దర్శనం ఇచ్చాయి. ముద్దపప్పు, బలి దేవతకు స్వాగతం అంటూ వెలిసిన పోస్టర్‌లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. గతంలో రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మాటలను ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేస్తు్న్నారు. ఈ పోస్టర్లు ఎవరు అంటించారనే దానిపై కాంగ్రెస్ శ్రేణులు ఆరా తీసి పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడంతో పాటు భారీ బహిరంగ సభ జరగనున్న తరుణంలో ఈ పోసర్లు దర్శనమివ్వడం రేవంత్ వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Posters with Revanth Reddy photo are scattered in Banjara Hills

మరో పోస్టర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బయటకు వచ్చిన స్కాంలను వివరిస్తూ పోస్టర్లు కూడా అంటించిన సంగతి తెలిసిందే. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనిల ఫొటోల కింద నేషనల్ హెరాల్డ్ స్కామ్, దిగ్విజయ్ సింగ్ ఫొటో కింద రిక్రూట్‌మెంట్ స్కామ్, మీరా కుమార్ ఫొటో కింద ఎన్ హెచ్ఏ స్కామ్, చిదంబరం ఫొటో కింద ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కామ్‌, మన్మోహన్ సింగ్ ఫొటో కింద కోల్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వివరాలు ఉన్న పోస్టర్లు ఉన్నాయి. మిగతా నేతల ఫొటోల కింద కూడా వారి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వినిపించిన స్కామ్‌ల వివరాలను ముద్రించారు.

publive-image

గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా నగరమంతా పోస్టర్లు వెలిసిన విషయం విధితమే. మొత్తానికి ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఈ పోస్టర్లతో మరింత వేడెక్కతున్నాయి.

ఇది కూడా చదవండి: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో చూసి భగ్గుమంటున్న నెటిజన్లు..

Advertisment
Advertisment
తాజా కథనాలు