Peddapalli: పెద్దపల్లిలో క్షుద్రపూజలు...ఆరుగురు నిందితుల అరెస్ట్‌!

పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేగింది. క్షుద్రపూజలు చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందపల్లి ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్ దగ్గర అర్ధరాత్రి కొందరు ఖాళీ స్థలంలో ఓ గుడిసె వేసి గొయ్యి తవ్వారు. తెల్లవారు జామున అటుగా వచ్చిన స్థానికులు గమనించారు.

New Update
Peddapalli: పెద్దపల్లిలో క్షుద్రపూజలు...ఆరుగురు నిందితుల అరెస్ట్‌!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలు చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందపల్లి ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్ దగ్గర అర్ధరాత్రి కొందరు ఖాళీ స్థలంలో ఓ గుడిసె వేసి గొయ్యి తవ్వారు. తెల్లవారు జామున అటుగా వచ్చిన స్థానికులు గమనించారు.

గొయ్యి తవ్విన ప్రాంతంలోపసుపు,కుంకుమ,నిమ్మకాయలు,గడ్డపారలను చూసి భయాందోళనలకు గురయ్యారు.పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు.కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గుప్త నిధుల కోసం ఇలా చేశారని స్థానికులు అంటున్నారు. అయితే గుప్త నిధుల కోసమా లేక... అమాయకపు ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకుని క్షుద్రపూజల పేరు సొమ్ము చేసుకుంటున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Also read: మంచి మనస్సు చాటిన ఏపీ మంత్రి సవిత.. రోడ్డు ప్రమాదాన్ని చూడగానే..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband: భార్యపై అనుమానంతో సుత్తితో కొట్టి చంపిన భర్త

నోయిడాలో భార్య మీద అనుమానంతో నూరుల్లా హైదర్ ఆమెను సుత్తితో కొట్టి చంపాడు. వారికి 2005లో పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యకు ఆఫీస్‌లో వివాహేతర సంబంధం ఉందని హైదర్ అనుమానంతో ఈ పని చేశాడు.

New Update
man kill his wife

man kill his wife Photograph: (man kill his wife)

భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపేశాడు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నూరుల్లా హైదర్(55)కు 2005లో అస్మా ఖాన్‌తో వివాహమైంది. వీరికి బీటెక్ చదువుతున్న ఓ కుమారుడు, 8వ తరగతి చువుతున్న ఓ కుమార్తె ఉంది. నోయిడాలోని సెక్టార్ 15లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. భార్య అస్మా ఖాన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.  ఆమె గతంలో ఢిల్లీలో నివసించింది. ఆమె భర్త జామియా మిలియా ఇస్లామియా నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్. ప్రస్తుతం అతను కూడా ఓ ప్రైవేట్ ఎంప్లాయి.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

అస్మాఖాన్‌ సెక్టార్ 62లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నూరుల్లా హైదర్ ఉద్యోగం పోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్మాఖాన్‌కు వివాహేతర సంబంధం ఉన్నదని నూరుల్లా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి కూడా అదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో సుత్తి తీసుకుని అస్మా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని వారి కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment