Narendra Modi: ఏపీ విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదని ప్రధాని మోదీ మరోసారి పునర్ధాఘటించారు. పార్లమెంట్ ప్రత్యేక భవానికి వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగిందని.. కానీ ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లా ఆంధ్ర, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు.

New Update
Narendra Modi: ఏపీ విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Narendra Modi: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదని ప్రధాని మోదీ మరోసారి పునర్ధాఘటించారు. పార్లమెంట్ ప్రత్యేక భవానికి వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగిందని.. కానీ ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లా ఆంధ్ర, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు. దివంగత ప్రధాని వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మూడు రాష్ట్రాల విభజన అన్ని వర్గాలను సంతృప్తిపరిచిందని, అన్ని చోట్లా సంబరాలు కూడా జరిగాయని వ్యాఖ్యానించారు. కానీ ఏపీ విభజన మాత్రం ఎంతో ప్రయాసతో జరిగిందన్నారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ వర్గాలను సంతృప్తిపర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని మోదీ వెల్లడించారు.

ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రుల సేవలను కూడా ఆయన కొనియాడారు. పార్లమెంట్‌లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ప్రసంగం ఇప్పటికీ ఎందరో ప్రజాప్రతినిధులకు స్ఫూర్తినిస్తుందన్నారు. స్ట్రోక్ ఆఫ్ ది మిడ్‌ నైట్. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ.. భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుందని పండిట్ నెహ్రు స్వరం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉందన్నారు. అలాగే ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఈ దేశం శాశ్వతం అని వాజ్‌పేయీ చెప్పిన మాటలు కూడా స్ఫూర్తికి నిలుస్తున్నాయని గుర్తుచేసుకున్నారు.

అంతేకాకుండా 2001 పార్లమెంటుపై ఉగ్రదాడి ఘటనను దేశం ఎప్పటికీ మరిచిపోదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి పార్లమెంట్‌ సభ్యుడిని రక్షించేందుకు కురిపించిన బుల్లెట్ల ధ్వని ఇంకా నాకు వినిపిస్తూనే ఉందని భావోద్వేగానికి గురయ్యారు. పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు పలికే ఈ సమయంలో జర్నలిస్టుల సేవలను గుర్తు చేసుకోవాలన్నారు. సాంకేతికత అందుబాటులో లేనప్పుడు కూడా వారు పార్లమెంట్ సమావేశాలను ప్రజలకు అందించేందుకు కృషి చేశారని.. ఈ పార్లమెంటు ద్వారా దేశాభివృద్ధిని పాత్రికేయులు కవర్‌ చేశారని మోదీ గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..

Advertisment
Advertisment
తాజా కథనాలు