పాలిటిక్స్, కబడ్డి.. సేమ్ టూ సేమ్..మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!

కాకినాడ జిల్లాలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీల కబడ్డీ పోటీలను ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తన చిన్నతనంలో కబడ్డీ అప్పట్లో గ్రౌండ్లో ఆడితే.. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఆడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
MLA Roja : ఐదేళ్ళల్లో దాదాపు రెండు రెట్లు పెరిగిన రోజా ఆస్తులు..

Minister Roja Sensational comments: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఉత్సాహంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister Roja Selvamani). జేఎన్ టీయూకే, ఆదిత్య కళాశాల నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సి టీల కబడ్డీ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు.

Also Read: నా భార్యను కలవాలని ఉంది..కోర్టులో పిటిషన్‌ వేసిన సిసోడియా!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి ఇలా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. దాదాపు 1200 మంది 113 యూనివర్సిటీ లకు చెందిన 95 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. అయితే, క్రీడాకారులతో సరదాగా తొడగొట్టి కబడ్డీ బరిలోకి దిగారు మంత్రి రోజా. సరదాగా సందడి చేశారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ..కబడ్డీ (Kabaddi) మన సంస్కృతికి ప్రతిబింబం అంటూ వ్యాఖ్యనించారు. కబడ్డీ మన దేశ క్రీడ.. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబం అంటూ కీర్తించారు.

ఈ క్రమంలోనే తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు మంత్రి ఆర్కే రోజా. తాను స్కూల్లో చదువుతున్నప్పుడు ధైర్యంగా కబడ్డీ ఆడే వారని తెలిపారు. అప్పుడు గ్రౌండ్లో ఆడితే, ప్రస్తుతం పాలిటిక్స్ లో ఆడుతున్నానని పేర్కొంటూ మిగతాదంతా సేమ్ టూ సేమ్ అంటూ పంచ్ డైలాగ్ వేశారు. ఈ నేపధ్యంలోనే వచ్చే డిసెంబరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో రాబోతున్నమని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి సచివాలయం పరిధిలో ఆడదాం ఆంధ్ర క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు