Petrol,diesel :ఇక పెట్రోల్,డీజిల్ రేట్లు కూడా తగ్గనున్నాయా..!!

గ్యాస్ ధరలు భారీగా తగ్గడంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయన్న వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. కేంద్రం పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలను కూడా 5 రూపాలయ వరకు తగ్గిస్తుందన్న వార్త బాగా ఊపందుకుంది. దీంతో వాహనదారుల్లో ఆశలు మొదలయ్యాయి. అయితే ఈ వార్త వెనుక కారణం కూడా ఉంది. 2023 జూన్ నెలలోనే ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటనను వెల్లడించాయి. ఇంధన ధరలను తగ్గించడానికి ఛాన్స్ ఉందని ప్రకటించాయి. దీంతో గ్యాస్ ధరలను తగ్గించడంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను మోడీ సర్కార్ తగ్గిస్తుందన్న వార్త చక్కర్లు కొడుతుంది..

New Update
Petrol,diesel :ఇక పెట్రోల్,డీజిల్ రేట్లు కూడా తగ్గనున్నాయా..!!

Petrol,diesel : గ్యాస్ బండ గుదిబండగా మారిన సమయంలో అనూహ్యంగా ఒక్కసారిగా సెంట్రల్ గవర్నమెంట్ సిలిండర్ ధర పై ఏకంగా 200 రూపాయలు రాయితీ ఇచ్చింది. ఇక ఉజ్వల్ స్కీం కింద అయితే ఏకంగా 400 రూపాయల రాయితీ ఇచ్చింది మోడీ సర్కార్. అయితే కేంద్రంలో బీజేపీ సర్కార్ పగ్గాలు పట్టినప్పట్నుంచి పెరుగుతూనే పోయిన గ్యాస్ సిలిండర్ ధర ఇంత భారీ మొత్తంలో ఒకేసారి తగ్గడం రికార్డ్ ను క్రియేట్ చేసింది. మరో వైపు జనం మాత్రం ఇది కలయా.. నిజమా అన్నట్టుగా  ఆలోచనలో పడ్డారు.

పెట్రోల్,డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని...!

అయితే గ్యాస్ ధరలు భారీగా తగ్గడంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయన్న వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. కేంద్రం పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలను కూడా 5 రూపాలయ వరకు తగ్గిస్తుందన్న వార్త బాగా ఊపందుకుంది. దీంతో వాహనదారుల్లో ఆశలు మొదలయ్యాయి. అయితే ఈ వార్త వెనుక కారణం కూడా ఉంది. 2023 జూన్ నెలలోనే ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటనను వెల్లడించాయి. ఇంధన ధరలను తగ్గించడానికి ఛాన్స్ ఉందని ప్రకటించాయి. దీంతో గ్యాస్ ధరలను తగ్గించడంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను మోడీ సర్కార్ తగ్గిస్తుందన్న వార్త చక్కర్లు కొడుతుంది.

అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు స్థిరంగా ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అంశాన్ని చమురు కంపెనీలు పరిశీలించవచ్చని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నెల రోజుల క్రితమే వెల్లడించారు. చమురు కంపెనీల పనితీరు ఎలా ఉందో కూడా ధరల తగ్గుదల ఆధారపడి ఉంటుందన్నారు.

వచ్చే త్రైమాసికంలో ఈ కంపెనీలు మెరుగ్గా రాణిస్తే, ధరల తగ్గింపుపై వారు నిర్ణయం తీసుకోగలుగుతారన్నారు. అయితే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

West Bengal: బెంగాల్‌లో చెలరేగిన హింస.. రైల్వే ట్రాక్‌లు ధ్వంసం

వక్ఫ్ చట్టం, 1995 సవరణలను చేస్తూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై ముస్లిం సమాజంతోపాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ్ బెంగాల్‌లో శుక్రవారం చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి.

New Update
wbengal

wbengal

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ్ బెంగాల్‌లో శుక్రవారం చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి. కనీసం రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలోని నిమ్తితా, సూతిలో శుక్రవారం నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 

Also Read: America -Trump: ట్రంప్‌ ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌!

నిమ్తితా రైల్వే స్టేషన్‌లో నిరసనకారులు గంటల తరబడి రైలు పట్టాలను దిగ్బంధించి.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడంతో పలువురు తీవ్రంగా గాయాల పాలయ్యారు.

Also Read: Telangana: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఆ ప్రాంతంలో మోహరించారు. తాజా సమాచారం ప్రకారం.. పరిస్థితి చాలా వరకు అదుపులో ఉంది. ముర్షిదాబాద్ జిల్లాలోని సూతి పోలీస్ స్టేషన్ పరిధిలోని సజూర్ క్రాసింగ్ ప్రాంతంలోనూ నిరసనకారులు, రాష్ట్ర పోలీసు సిబ్బంది మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలీసు సిబ్బందిపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పాటు నాటు బాంబులు విసిరినట్టు సమాచారం.

ఈ ఘటనలో పోలీసు సిబ్బందితో పాటు సాధారణ పౌరులు గాయపడ్డారు. ఆ గుంపుపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి అదనపు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది.దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అమ్తాలా ప్రాంతంలో కూడా ఆందోళనలు హింసకు దారితీశాయి. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులు స్థానిక పోలీసు సిబ్బందిపై దాడులకు దిగారు. పోలీసులు ప్రతిఘటించడంతో జాతీయ రహదారి 117పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని చంప్‌దానిలో కూడా పరిస్థితి ఇలాగే ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఒక వర్గం నిరసనలతో రాష్ట్రం పెద్ద ఎత్తున హింస, అరాచకం, చట్టరాహిత్యాన్ని చూస్తోందని ఆరోపించారు. ‘‘భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నామని, దేశంలోని చట్టాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టంగా చెప్పిన ఈ వ్యక్తులు వీధుల్లోకి వచ్చారు. ఇష్టానుసారంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.. తీవ్రవాద మూకలతో ప్రజల భద్రత రాజీ పడింది’ అని ఆయన మండిపడ్డారు.

హింసాత్మక ఘటనలపై బెంగాల్ గవర్నర్ కార్యాలయం స్పందించింది. పరిస్థితిని అదుపులో ఉంచడానికి తక్షణ,కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్‌‌కు రాజ్‌భవన్ నుంచి సందేశం వెళ్లింది. అనంతరం గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వీడియో విడుదల చేస్తూ.. ‘‘బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని తనకు ఆందోళనకరమైన నివేదికలు అందుతున్నాయి..రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం అందడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో నేను చర్చించాను’’ అని ఆయన తెలిపారు.

‘కొన్నిచోట్ల ఈ రోజు కూడా అల్లర్లు జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిగాయి. దుండగులపై ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటుందని, అల్లర్లు పెరగడానికి అనుమతించదని చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చారు. దుండగులపై అన్ని చర్యలు తీసుకుంటారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించం’ అని గవర్నర్ హెచ్చరించారు.

Also Read: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

Also Read: Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

west bengal | west bengal news | west-bengal-government | waqf-act | waqf-board | Waqf Bill 2025 | modi | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment