Pawan AI Video: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్!

తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన డ్రోన్ల ద్వారా ఓ మహిళ సాయాన్ని అందుకుంటున్న ఫొటోను చూపించారు. అయితే ఆ ఫొటో ఏఐ అని, దాని మీద లోగో కూడా ఉందని నెట్టింట ట్రోల్స్‌ మొదలయ్యాయి.

New Update
Pawan AI Video: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్!

Pawan AI Video: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం మిగిల్చిన బాధలు అన్ని ఇన్ని కాదు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్ష కూడా నిర్వహించారు. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రదర్శించిన ఫొటో పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నడుము లోతు నీళ్లల్లో ఉన్న ఓ మహిళకు డ్రోన్‌ ద్వారా సాయం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఆయన చూపించారు.

డ్రోన్ల పనితీరుకు ఇది నిదర్శనమని ఆయనపేర్కొన్నారు. ఈ ఫొటోకు అంతర్జాతీయ అవార్డు కూడా వస్తుందని అన్నారు. అయితే ఈ వీడియోను నెటిజన్లు షేర్‌ చేస్తూ ఇందులోని ఫొటో ఏఐ అని, లోగో కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరి దీని గురించి పవన్‌ , జనసేన వారు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

Also Read: టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: కావలి చేరుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్‌ భౌతికకాయం

నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెహల్గామ్‌ లో ఉన్మాద ఉగ్రవాదుల చేతులో కావలి కి చెందిన మధుసూధనరావు హతమయ్యారు. దీంతో ఆనాలవారి వీధిలోని మధుసూదనరావు నివాసం వద్ద విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కాగా ఆయన మృతదేహం కావలికి చేరుకుంది.

New Update
Body of software engineer Madhusudhan

Body of software engineer Madhusudhan

Pahalgam Terror Attack : నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెహల్గామ్‌ లో ఉన్మాద ఉగ్రవాదుల చేతులో కావలి కి చెందిన మధుసూధనరావు హతమయ్యారు. దీంతో ఆనాలవారి వీధిలోని మధుసూదనరావు నివాసం వద్ద విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కాగా ఆయన మృతదేహం కావలికి చేరుకుంది.దూరప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, సన్నిహితులు భారీ సంఖ్యలో కావలికి తరలి వస్తున్నారు. మధుసూధనరావు ఇక లేరనే వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా కాశ్మీర్ నుంచి తెల్లవారు జామున 3 గంటలకు చెన్నైకు తీసుకు వచ్చిన ఆయన పార్థివ దేహన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు కావలి తాసిల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ స్వాధీనం చేసుకున్నారు.  ఎయిర్‌ పోర్టులో ఆయన భౌతికకాయానికి పలువురు అధికారులు, ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం కావలికి తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

 అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు నివాసముంటున్నారు. మధుసూదన్‌రావు 12 ఏళ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన మృతదేహానికి కావలిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గామ్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్టణానికి చెందిన ఏపీ తెలుగు సంఘం సభ్యుడు జేఎస్ చంద్రమౌళి కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి

పదిలక్షల ఆర్థికసాయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రమౌళి, మధుసూదన్‌లకు సంతాపం తెలిపారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో తమ ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబాలకు అండగా ఉన్నాయని, ఈ అపారమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని తాను ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మచ్చ అని చెప్పారు.పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి లో మృతి చెందిన ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు నష్ట పరిహారం ప్రకటించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి బుధవారం వైజాగ్ లో నివాళులుఅర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడి అనాగరిక చర్యగా పేర్కొన్నారు. కశ్మీర్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుండగా.. ఈ దాడితో అవన్నీ కుంటుపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిచాలని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు.. సరిహదుల్లో ముష్కరుల చొరబాటును అడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడిలో వైజాగ్ కు చెందిన చంద్రమౌళితోపాటు, కావలికి చెందిన మధు సూదన్ రావులు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!
 

తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది..


కశ్మీర్‌లోని పెహెల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జేఎస్‌ చంద్రమౌళి మృతదేహానికి ఆయన బుధవారం రాత్రి నివాళులర్పించారు. విశాఖ ఎయిర్‌పోర్టు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోడియంపై ఉంచిన మృతదేహంపై స్వయంగా జాతీయ పతాకాన్ని కప్పారు. చంద్రమౌళి తోడల్లుడు కుమార్‌రాజా, బావమరిది బీఎస్‌ నాగేశ్వరరావుతో పాటు ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి, కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. అంతిమయాత్ర వాహనం ముందు నడుస్తూ నిర్వహించిన శాంతి ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులను దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

Advertisment
Advertisment
Advertisment