Pawan Kalyan: చంద్రబాబుకు బెయిల్ రావడంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే.! చంద్రబాబుకి బెయిల్ రావడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని..అందరం ఆయనను స్వాగతిద్దాం అని ట్వీట్ చేశారు. By Jyoshna Sappogula 31 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Pawan Kalyan about Chandrababu Bail: ఏపీలో సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ మధ్యంతర బెయిల్ లభించింది. కంటి సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. ఆయన జైలు నుండి బయటకు వస్తున్నారని తెలియడంతో టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షం జనసేనకు కూడా ఊరట నిచ్చింది. Also Read: యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేష్.. చంద్రబాబు నేరుగా అక్కడికే.. తాజాగా, జనసేన పార్టీ (Janasena) ఛీప్ పవన్ కళ్యాణ్ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్పందించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పరిణామాలపై పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీ @ncbn గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Hd1xjBsOCS — JanaSena Party (@JanaSenaParty) October 31, 2023 చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. 'తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం' అని ట్వీట్ చేశారు. #chandrababu #janasena-pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి