పవన్ సినిమాలో హీరోయిన్‌.. ఆ పనికి ఒప్పుకోలేదని తీసేశారు!

ఒక హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది పవన్ హీరోయిన్ అదితి. అయితే, ఆ హీరో ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల బాలకృష్ణ మీద కూడా తమిళ నటి విచిత్ర ఇలాంటి ఆరోపణలే చేసింది.ఈ నేపథ్యంలోనే అదితి గోవిత్రికర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

New Update
పవన్ సినిమాలో హీరోయిన్‌.. ఆ పనికి ఒప్పుకోలేదని తీసేశారు!

Aditi Govitrikar: మీటూ ఉద్యమంలోకి పవర్ స్టార్ సినిమా హీరోయిన్ కూడా చేరింది. జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో తమ్ముడు మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అదితి గోవిత్రికర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వయ్యారి భామ నీ హంస నడక అంటూ ఆ మూవీలో పవన్ మతిపోగొట్టే పాత్రలో నటించింది అదితి.

publive-imageఅయితే అదితి గోవిత్రికర్ ఓ సినిమా షూటింగ్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన సమయంలో.. ఒక హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మొహంపైనే గదిలోకి వస్తావా అని పిలిచాడట అతగాడు. దీంతో వెంటనే అతన్ని మందలించి వెళ్లిపోయిందట అదితి. మరుసటి రోజే అదితికి, ఆమె టీమ్‌కి టికెట్లు బుక్ చేయించి ఇండియా పంపించేశారట. అంత దారుణంగా ఎలా ప్రవర్తించారో తనకి ఇప్పటికీ కార్ధం కాలేదంటూ.. ఇంటర్వ్యూలో వాపోయింది అదితి.

publive-imageఇంతకీ.. అంతకి తెగించిన ఆ హీరో ఎవరో మాత్రం రివీల్ చేయలేదు తమ్ముడు భామ. ఇటీవల బాలకృష్ణ మీద కూడా తమిళ నటి విచిత్ర ఇలాంటి ఆరోపణలే చేసింది. భలేవాడివి బాసూ సినిమా షూటింగ్ సందర్భంగా బాలయ్య.. తనని గదిలోకి పిలిచాడనీ, తను వెళ్లకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పెట్టారని బిగ్‌బాస్ షోలో చెప్పింది విచిత్ర. ఆమె ఆరోపణలు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అదితి గోవిత్రికర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

publive-image

Also Read: శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే!

Advertisment
Advertisment
తాజా కథనాలు