Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు షురూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. By V.J Reddy 21 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Parliament Sessions From Tomorrow : రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Sessions) ప్రారంభం కానున్నాయి. 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రేపు ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన సమాచారం, జీడీపీ వృద్ధి, విశ్లేషణలతోపాటు ఉపాధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది. కాగా రేపు ప్రారంభమైయ్యే సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిపక్షాల వ్యూహాలు.. పార్లమెంట్ లో అధికార పార్టీకి చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యాయి ప్రతిపక్షాలు. దేశంలో సంచలనంగా మారిన నీట్ పేపర్ లీకేజి (NEET Paper Leakage), వరుస రైలు ప్రమాద ఘటనలు, పెరిగిన ధరలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాగా లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలపగా.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. మరి ఈసారి ప్రతిపక్షాలకు అధికార పార్టీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి. Also Read : భారత్ లో కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పినదానికన్నా ఎక్కువట.. షాకింగ్ రిపోర్ట్! #parliament-sessions #nirmala-sitharaman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి