Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు

ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు

Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మూడోసారి ప్రధానిగా మోదీ ఈ నెల 9న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీల వివరాలు పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ 8 మంది మంత్రులతో రెండో స్థానంలో నిలించింది. 

ఇక మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఆంధ్రప్రదేశ్‌ 3, తమిళనాడు 3, హర్యాణాకు 3 మంత్రి పదవులు దక్కాయి. అలాగే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, ఒడిశా, ఝూర్ఖండ్ రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు (MP Seats) కేటాయించారు. ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, అరుణచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు