Delhi: సీఈసీ, ఈసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. ఇక నుంచి ఆ బాధ్యత వారిదే.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించింది. By Shiva.K 21 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CEC Bill in Parliament: ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ‘ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్‌మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు- 2023’ను గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదించింది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు రాజ్యసభ ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. కొత్త బిల్లు ప్రకారం.. ఇక నుంచీ సెర్చ్, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి. అధికారాల విభజనకు అనుగుణంగా బిల్లు.. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనలు లేవని పేర్కొంటూ.. 1991 నాటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. ప్రస్తుతమున్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లు ఉందని వివరించారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదా, వేతనాలకు సంబంధించిన సవరణలూ ఇందులో పొందుపర్చారు. Also Read: దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా.. విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు.. #cec-bill-in-parliament మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి