Paris Olympics 2024: మరో గోల్డ్ కు జావెలిన్ గురిపెట్టబోతున్న నీరజ్.. మ్యాచ్ ఎప్పుడంటే.. 

ఒలింపిక్స్ లో జావెలిన్ లో 2020లో స్వర్ణ పతకం తెచ్చాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు ఈ గోల్డెన్ బాయ్ మరో బంగారు పతకాన్ని తేవడానికి సిద్ధం అయ్యాడు. ఈరోజు అంటే ఆగస్టు 6న నీరజ్  పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో గ్రూప్ Bలో పోటీపడనున్నాడు. 

New Update
Paris Olympics 2024: మరో గోల్డ్ కు జావెలిన్ గురిపెట్టబోతున్న నీరజ్.. మ్యాచ్ ఎప్పుడంటే.. 

Paris Olympics 2024: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. అతనితో పాటు కిషోర్ జెనా కూడా టోర్నీలో పాల్గొంటాడు. భారత జావెలిన్ మాస్టర్స్ ఉత్కంఠ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఎక్కడ ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది తెలుసుకుందాం. దానితో పాటు భారత్ ఈరోజు అంటే ఆగస్టు 6న పాల్గొనే ఒలింపిక్ ఈవెంట్స్ షెడ్యూల్ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు.  2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత క్రీడా నైపుణ్యాన్ని పెంచిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఈసారి కూడా స్వర్ణం సాధిస్తాడని భారత్ ఆశాభావంతో ఉంది. 

మ్యాచ్‌లు ఎప్పుడు?

  1. 1:50 PM: పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయర్ గ్రూప్ Aలో కిషోర్ జెనా పోటీపడతాడు.
  2. 3:20 PM: పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్ గ్రూప్ Bలో నీరజ్ చోప్రా పోటీపడతాడు.

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చు?

Paris Olympics 2024: రిలయన్స్ యాజమాన్యంలోని వయాకామ్ 18 2024 పారిస్ గేమ్‌లను ప్రసారం చేస్తుంది. Sports18 నెట్‌వర్క్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ JioCinema కూడా ఈవెంట్‌ను ప్రసారం చేస్తుంది.

Paris Olympics 2024: Sports18 – 1 తమిళం - తెలుగు భాషా ఎంపికలతో పాటు ఇంగ్లీష్ లో కూడా  క్రీడా ఈవెంట్‌లను ప్రసారం చేస్తుంది. JioCinema – ఇంగ్లీష్, హిందీ, తమిళం - తెలుగుతో సహా వివిధ భాషలలో ఉచిత ప్రత్యక్ష ప్రసారం అందిస్తోంది. 

ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ వాటి షెడ్యూల్ ఇదే.. 

  • 1:30 PM: పురుషుల టీమ్ ప్రీక్వార్టర్ ఫైనల్‌లో హర్మీత్ దేశాయ్, శరత్ కమల్, మానవ్ ఠక్కర్ చైనాతో పోటీపడతారు.
  • 2:30 PM: మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ 16లో యుయ్ సుసాకి (జపాన్)తో వినేష్ ఫోగట్ తలపడనుంది. 
  • 2:50 PM: మహిళల 400 మీటర్ల రెపెచేజ్ రౌండ్‌లో కిరణ్ పహల్ పోటీపడుతుంది.
  • 4:20 PM: అర్హత సాధిస్తే, వినేష్ ఫోగట్ మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల క్వార్టర్ ఫైనల్‌లో పోటీపడుతుంది. 
  • 10:25 PM: కొనసాగితే కనుక  మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల సెమీఫైనల్‌లో వినేష్ ఫోగట్ పోటీపడుతుంది. 
  • 10:30 PM: పురుషుల సెమీ ఫైనల్‌లో భారత హాకీ జట్టు జర్మనీతో ఆడుతుంది.

Also Read : ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా

Advertisment
Advertisment
తాజా కథనాలు