Paripoornananda Swami: నాకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం.. పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు

AP: బీజేపీలో తనకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు పరిపూర్ణానంద. చంద్రబాబుది ఓటు బ్యాంకు రాజకీయం అని ఫైర్ అయ్యారు. హిందూ సమాజం దగా పడుతోందని అన్నారు.

New Update
Paripoornananda Swami: నాకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం.. పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు

Paripoornananda Swami Comments On Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేశారు పరిపూర్ణానంద. తనకు సీటు రాకపోవడానికి చంద్రబాబే కారణం అని అన్నారు. కూటమిలో ఇంకా సీట్ల గందరగోళం ఉందని వ్యాఖ్యానించారు. తాను ఎన్నో సేవలు చేశా, తనకు ప్రజల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుది ఓటు బ్యాంకు రాజకీయం అని ఫైర్ అయ్యారు. హిందూ సమాజం దగా పడుతోందని అన్నారు.

ALSO READ: ఓవైసీ గోవులను కోసి తినమంటాడు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

హిందూ వ్యవస్థకు అవమానం జరుగిందని అన్నారు. 10-12 శాతం ఉన్న ముస్లింల ఓట్ల కోసం 90 శాతం ఉన్న హిందువులను తల దించుకునేలా చేశారని విమర్శించారు. ప్రజలకు ఏం కావాలో చెప్పగలిగే దమ్ము తనకు ఉందని అన్నారు. హిందూపురంలో సైకిల్‌కు ఓటేస్తే హైదరాబాద్‌లో తిరుగుతుందని అన్నారు. హిందూపురంలో ఫ్యాన్‌కు ఓటేస్తే బెంగళూరులో తిరుగుతుందని ఎద్దేవా చేశారు. ఇండిపెండెంట్‌గా గెలిస్తే మోడీని కలిసి హిందూపురాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు